లారీని ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్న బస్సులు
ABN, Publish Date - Feb 01 , 2025 | 11:32 PM
ఉండవల్లి మండల పరిధిలోని పుల్లూరు గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై పుల్లూరు టోల్‌ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో 14మందికి గాయాలయ్యాయి.
- డ్రైవర్‌తో సహా 14మందికి గాయాలు
- హెచ్చరికలివ్వకుండా బండలలారీ యూటర్న్‌తోనే ప్రమాదం: తప్పిన ప్రాణాపాయం
అలంపూరుచౌరస్తా, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ఉండవల్లి మండల పరిధిలోని పుల్లూరు గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై పుల్లూరు టోల్‌ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో 14మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదు నుంచి కర్నూలు వైపు వెళ్తున్న ఓ బండల లారీని నడుపుతున్న డ్రైవర్ తిరుపాలు శనివారం తెల్లవారుజామున పు ల్లూరు టోల్‌ప్లాజాకు కాస్త ముందే ఎలాంటి హెచ్చరికలు ఇవ్వకుండా యూ టర్న్ తీసుకు నేందుకు ప్రయత్నించాడు. వెనక వస్తున్న సీజీ ఆర్ ట్రావెల్స్ బస్సు అతివేగంగా లారీని ఢీకొం ది. క్షణాల్లోనే సీజేఆర్ బస్సును వెనక నుంచి కా వేరి ట్రావెల్స్ బస్సు ఢీకొంది. దీంతో రెండు బ స్సుల్లో ఉన్న సుమారు 70మంది ప్రయాణికుల అర్తనాదాలతో ఆ ప్రాంతం భీతిల్లింది. అందులో ని ప్రయాణికులు గావుకేకలు పెట్టడంతో సమీ పంలోని హోటల్స్ వద్ద ఉన్నవారంతా అక్కడికి చేరుకుని గాయపడినవారిని కాపాడే ప్రయత్నం చేశారు. హుటాహుటిన హైవే సిబ్బంది అక్కడ కు చేరుకుని క్షతగాత్రులను బయటకు తీసేం దుకు ప్రయత్నించారు. కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ చంద్రశేఖర్ కాళ్లు విరిగి ఇరుక్కుపోవడం తో హైవే సిబ్బంది జాగ్రత్తగా బయటకు లాగి కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మరో ట్రావె ల్స్ బస్సు బాబుసాహెబ్‌కు మోస్తారు గాయా లు కావడంతో అతడిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకు న్న 108, హైవే సిబ్బంది అక్కడికి చేరుకుని అ వసరమైనవారికి ప్రథమ చికిత్సలు, రక్తగాయా లైనవారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో రెండు బస్సుల్లోని ప్రయా ణికులు సమీర్, రోహిత్, ప్రసాద్, ఆజయ్, బా బు, సందీప్, శ్రీధర్, సావిత్రి, లక్ష్మిదేవి, ఒబుల్‌రె డ్డి, జగదీష్, రాఘవరెడ్డి ఉన్నారు. ఎవరికి ప్రా ణాపాయం లేదని వైద్యులు తేల్చడంతో వారి బంధువులు, మిత్రులు ఊపిరి పీల్చుకున్నారు. సీజీఆర్ మేనేజర్ చెన్నంశెట్టిరెడ్డయ్య ఈ ఘటన పై ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే సుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తె లిపారు. లారీ డ్రైవర్ అజాగ్రత్తతో ఎలాంటి హె చ్చకలు ఇవ్వకుండా మలుపు తిప్పడం, అదే స మయంలో ట్రావెల్స్ బస్సులు రావడం ప్రమా దానికి కారణాలుగా పోలీసులు అంచనాకు వచ్చారు. గంటపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Updated Date - Feb 01 , 2025 | 11:33 PM