ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
ABN, Publish Date - Feb 11 , 2025 | 11:19 PM
ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి కేవీవీ రవికుమార్ సూచించారు.
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి కేవీవీ రవికుమార్ సూచించారు. దుండగులు తప్పుడు ఈ మేయిల్స్ లేదా వెబ్‌సైట్ల ద్వారా బాధితులను మోసం చేసి, వారి సున్నితమైన సమాచారాన్ని (పాస్ వర్డులు, బ్యాంక్ వివరాలు) పొందడానికి ప్రయత్నిస్తారని వివరించారు. సేఫర్ ఇంటర్నెట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఆన్‌లైన్ మోసాలపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆన్‌లైన్ మోసాలపై నేను కొంత డబ్బును కోల్పోయానని, ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ కాల్వ భాస్కర్ మాట్లాడుతూ ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ను ఉపయోగించేటప్పుడు సురక్షితమైన ఇంటర్‌నెట్ పద్దతుల గురించి వివరించారు. సైబర్ బెదిరింపులతో డబ్బు కోల్పోయిన తన కస్టమర్ల ఉదాహరణలను ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ తెలియజేశారు. సైబర్ దాడుల నుంచి రక్షించడానికి ఆన్‌లైన్ బ్యాంకింగ్ కోసం వర్చువల్ కీ బోర్డ్‌ను ఉపయోగించాలన్నారు. 100 మందికి పైగా వినియోగదారులు హాజరయ్యారు.
Updated Date - Feb 11 , 2025 | 11:19 PM