వైభవంగా అంజన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ABN, Publish Date - Feb 01 , 2025 | 11:31 PM
ధరూ రు మండల పరిధిలోని పెద్దచింతరేవుల గ్రామం లో వెలసిన ఆంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం అంజన్న బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
- ఆలయంలో ధ్వజారోహణ పూజలు
ధరూరు, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి) : ధరూ రు మండల పరిధిలోని పెద్దచింతరేవుల గ్రామం లో వెలసిన ఆంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం అంజన్న బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వ్యవస్థాపక వంశీయులు సి. గిరిరావు ఆధ్వర్యంలో అంజన్న స్వామి బ్ర హోత్సవాలు ప్రతి ఏటా మాఘ శుద్ధ తిదయ నుంచి ఏడు రోజుల పాటు నిర్వహించడం ఆన వాయితీ. బ్రహోత్సవాల్లో భాగంగా మొదటి రో జు శనివారం ఆలయ ప్రధాన అర్చకుడు మద్వా చారి, కిష్టాచారి, వామనాచారి స్వామివారికి అంకురార్పణం, ధ్వజారోహణం తదితర పూజలు నిర్వహించారు. ఆలయం సమీపంలో పుట్ట వద్ద అర్చ కులు నాగపూజ చేశారు. అనంతరం బాజాభజంత్రీ లు, మేళతాళాల మధ్య స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం నుంచి గ్రామం లోని పురవీధుల్లో ఊరేగిం పుగా తీసుకువెళ్లారు. ఉత్స వాల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం స్వామివా రికి ఉపనయనం, రాత్రి తె ప్పోత్సవం, ప్రభోత్సవం, పల్లకీ సేవ కార్యక్రమా లు ఉంటాయని అర్చకులు తెలిపారు. కాగా, ఉ త్సవాలను ఆలయ వంశీయులు, కార్యని ర్వాహ ణాధికారి సి.కవిత, అర్చకులు పర్యవేక్షించారు.
Updated Date - Feb 01 , 2025 | 11:31 PM