ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భక్తిశ్రద్ధలతో అభయుడి శకటోత్సవం

ABN, Publish Date - Jan 25 , 2025 | 11:41 PM

ఊర్కొండపేట అభయాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శకటోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వ హించారు.

ఊర్కొండపేట అభయాంజనేయస్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఎద్దుల బండ్లు

ఊర్కొండ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఊర్కొండపేట అభయాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శకటోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వ హించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండ మండలం, ఊర్కొండపేట అభ యాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు పుష్య బహుళ అమావాస్యను పురస్కరిం చుకొని ఉత్సవాలు (జాతర) నిర్వహిస్తుంటారు. ఈ జాతరకు వివిధ జిల్లాల నుంచి భక్తులు వస్తుంటారు. శనివారం ఉదయం ఊర్కొండపేట చిలివెల్లి కృష్ణమూర్తి ఇంటి నుంచి ఉత్సవమూర్తిని పల్లకీలో ఊరేగింపుగా ఆలయ ప్రవేశం చేయించారు. బ్రహ్మోత్సవాల ధర్మకర్తల మండలి చైర్మన్‌ సత్యనారా యణరెడ్డి, సభ్యులు, స్థానిక నాయకులు ధ్వజారోహణంతో స్వామికి పంచా మృతాభిషేకం, నూతన వస్త్రధారణ, అభరణాల ఆలంకరణతో పాటు ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం శకటోత్సవం ప్రారంభించారు. పరిసర గ్రా మాల నుంచి ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, కార్లను ఆలయం చుట్టు ప్రదక్షిణం చేశారు. ఆలయ పరిసరాలు ఆంజనేయ నామస్మరణతో మార్మోగాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా కల్వకుర్తి సీఐ నాగరాజు ఆధ్వ ర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అర్చకులు ప్రవీణ్‌ శర్మ, శ్రీనివాసశర్మ ఆలయం సిబ్బంది మారుతిరావు, వరలక్ష్మీ, శ్రీశైలం, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటయ్య గౌడ్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి రమేష్‌నాయక్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 25 , 2025 | 11:41 PM