ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రూ.5 లకే నాణ్యమైన భోజనం

ABN, Publish Date - Feb 11 , 2025 | 11:22 PM

జనరల్‌ ఆసుపత్రిలోని రోగులు, వారి బంధువులకు రూ.5లకే నాణ్యమైన భోజనం అందిస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

క్యాంటీన్‌ ప్రారంభించి, అన్నం వడ్డిస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

ప్రారంభించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం), ఫిభ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : జనరల్‌ ఆసుపత్రిలోని రోగులు, వారి బంధువులకు రూ.5లకే నాణ్యమైన భోజనం అందిస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం జనరల్‌ ఆసుపత్రిలోని ఆవరణలో భోజనం క్యాంటీన్‌ను ప్రారంభించి, మాట్లాడారు. మహిళా సంఘాలకు చేయూతనందించడంతో పాటు ఆసుపత్రికి వచ్చే రోగులకు, వారి బంధువులకు ఐదు రూపాయలకే భోజనం అందించాలనే సంకల్పంతో ఈ క్యాంటీన్‌ను ఏర్పాటు చేయించామని తెలిపారు. అయితే ఈ భోజనం తయారు చేయించేందుకు రూ.28 ఖర్చు అవుతోందని, ఇందులో మునిసిపాలిటీ నుంచి రూ.23 మహిళా సంఘాల సభ్యులకు అందజేయడం జరుగుతుందన్నారు. అందరు దీన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంపత్‌కుమార్‌ సింగ్‌, ముడా చైర్మన్‌ లక్ష్మన్‌ యాదవ్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లు నర్సింహరెడ్డి, హెచ్‌డీఎస్‌ సభ్యుడు రాఘవేందర్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి, నాయకులు గోవింద్‌యాదవ్‌, శ్రీనివాస్‌యాదవ్‌, కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

అర్హులకు న్యాయం చేస్తాం

పాలమూరు : సర్వే నెంబర్‌ 523లో ప్రభుత్వం ఇచ్చిన స్థలాల లబ్ధిదారులకు న్యాయం చేసి, అవినీతి పరులను శిక్షిస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం టీఎఫ్‌టీయూ, పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేయగా, ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గంలో డబుల్‌బెడ్‌రూం కేటాయింపులో అవినీతి జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్‌.యం ఖలీల్‌, యం.రాఘవాచారి, పి.విజయకుమార్‌, జి.గట్టన్న మాట్లాడారు. పాత పాలమూరు, వీరన్నపేట, బండ్లగేరి, తిరుమలదేవుని గుట్ట, ఫైర్‌స్టేషన్‌ ప్రాంతాల్లో నివాసం ఉండే వారికి అన్యాయం జరిగిందన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలన్నారు.

Updated Date - Feb 11 , 2025 | 11:22 PM