ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నీటి గుంతలో పడి చిన్నారి మృతి

ABN, Publish Date - Feb 01 , 2025 | 11:30 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్‌ సమీపంలోని ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా తీసిన గుంతలో నిలిచిన నీటిలో పడి ఓ చిన్నారి మృతి చెందింది. మరో చిన్నారి గల్లంతైన సంఘటన శనివారం చోటుచేసుకున్నది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు...

చిన్నారులు పడిపోయిన జడ్చర్ల మండలం ఉదండాపూర్‌ ప్రాజెక్టులోని నీళ్లు నిలిచిన గుంత

మరో చిన్నారి గల్లంతు

ఉదండాపూర్‌ రిజర్వాయర్‌లో ఘటన

జడ్చర్ల, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్‌ సమీపంలోని ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా తీసిన గుంతలో నిలిచిన నీటిలో పడి ఓ చిన్నారి మృతి చెందింది. మరో చిన్నారి గల్లంతైన సంఘటన శనివారం చోటుచేసుకున్నది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... ఉదండాపూర్‌ గ్రామానికి చెం దిన ఆరేళ్ల మల్లయ్య, పార్వతమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. 5వ తరగతి చదువుతున్న పెద్ద కుమార్తె పాఠశాలకు వెళ్లడంతో చిన్న కుమార్తె భాగ్యలక్ష్మి(6), కుమారుడు మహేశ్‌(4)లతో గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలానికి పార్వతమ్మ వెళ్లింది. పొలం వద్ద ఉన్న చెట్టు నీడన చిన్నారులను కూర్చోపెట్టి పొలంలోకి వెళ్లింది. ఆ చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఆ పక్కనే ఉన్న నీటిగుంతలో పడిపోయారు. గుర్తించిన తల్లి వారికోసం నీటిగుంతలో గాలించగా భాగ్యలక్ష్మి మృతదేహం లభించింది. సంఘటనా స్థలానికి జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి, ఫైర్‌ఇంజన్‌ సిబ్బంది చేరుకొని మహేశ్‌ కోసం గాలింపు చేపట్టారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తీసిన గుంతల చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని ఇప్పటికే పలు పర్యాయాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, చర్యలు తీసుకోని కారణంగా ఈ సంఘటన చోటుచేసుకున్నదని గ్రామస్థులు ఆరోపించారు.

Updated Date - Feb 01 , 2025 | 11:30 PM