అధికారుల మద్య సమన్వయ లోపం..
ABN, Publish Date - Jan 05 , 2025 | 12:37 AM
కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం ఈవో నియామకంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల మద్య సమన్వయలోపం గందరగోళంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రోజుకో ఉత్వర్వు.. ఇద్దరు ఈవోల నియామకం
ఫ ముందుగా వేములవాడ ఈవో.. మరో సారి వరంగల్ డీసీ
ఫ గందరగోళంగా దేవాదాయ శాఖ తీరు
ఫ కొండగట్టులో బాధ్యతలు చేపట్టిన వేములవాడ ఈవో వినోద్
మల్యాల, జనవరి 4(ఆంధ్రజ్యోతి): కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం ఈవో నియామకంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల మద్య సమన్వయలోపం గందరగోళంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొండగట్టు ఈవో బదిలీ కావడంతో మరొకరి నియామకం కోసం గురువారం దేవా దాయశాఖ కమిషనర్ ఉత్వర్వులు జారీ చేసింది. శుక్రవారం ప్రభుత్వం మరొకరిని నియమిస్తూ జీవో జారీ చేసింది. దీంతో అధికారుల తీరు సర్వాత్రా విస్మయం కలిగించింది. కొండగట్టు ఈవో రా మకృష్ణరావును బదిలీ చేస్తూ ఆయన స్థానంలో వేములవాడ ఈవో వినోద్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గురువారం కమిషనర్ తరుపున దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కె.జ్యోతి ఉత్త ర్వులు జారీ చేశారు. దీంతో శుక్రవారం రామకృష్ణరావు కొండగట్టు నుంచి రిలీవ్ కాగా వినోద్ బాధ్య తలు చేపట్టాల్సిన స్థానంలో మళ్లీ సాయంత్రం వరంగల్‌లో విధులు నిర్వహిస్తున్న డిప్యూటి కమిష నర్ టి.శ్రీకాంత్‌రావును నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారమయ్యర్ జీవో జారీ చేశా రు. మొదట కొండగట్టులో అదనపు బాధ్యతలు చేపట్టడానికి వినోద్ అయిష్టత వ్యక్తం చేసినట్లు అ నుకుంటున్న తరుణంలోనే శనివారం కొండగట్టు ఈవోగా అదనపు బాధ్యతలు చేపట్టారు. రోజుకో ఉ త్తర్వు జారీ కావడంతో దేవాదాయ శాఖ అధికార వర్గాల్లో అయోమయం నెలకొంది.
ఫ బాధ్యతలు చేపట్టిన ఈవో వినోద్
కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం ఈవోగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం ఈవో కె.వినోద్ భాద్యతలు చేపట్టారు. ఇక్కడి ఈవో ఎం.రామకృష్ణరావు సికింద్రాబాద్‌లోని గణేశ్ టెం పుల్ ఈవోగా బదిలీ కావడంతో వినోద్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ శాఖ ఉత్త ర్వులు జారీ చేసింది. స్వామి వారి సన్నిధిలో పూజలు నిర్వహించిన అనంతరం ఈవో వినోద్‌ను ఏఈవో అంజయ్య, పర్యవేక్షకులు సునీల్, చంద్రశేఖర్, ఆలయ సిబ్బంది, అర్చకులు అభినందించారు.
Updated Date - Jan 05 , 2025 | 12:38 AM