మహిళా దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ
ABN, Publish Date - Mar 10 , 2025 | 12:58 AM
టీఎన్‌జీవోస్ ఆధ్వర్యంలో ఈనెల 11న నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోస్టర్‌ను కలెక్టర్ పమెలాసత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ ఆదివారం ఆవిష్కరించారు.
సుభాష్‌నగర్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): టీఎన్‌జీవోస్ ఆధ్వర్యంలో ఈనెల 11న నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోస్టర్‌ను కలెక్టర్ పమెలాసత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ టీఎన్‌జీవోస్ ఫంక్షన్ హాలులో మహిళల కోసం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీజీవో జిల్లా అధ్యక్షుడు మడిపెల్లి కాళీచరణ్, కార్యదర్శి అరవింద్‌రెడ్డి, టీఎన్‌జీవోస్ కార్యదర్శి సంగెం లక్ష్మణ్‌రావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోట రామస్వామి, సర్దార్ హర్మిందర్‌సింగ్, సుమంత్‌రావు, రాజేశ్వరరావు, హస్గర్ కమలాకర్, కరుణాకర్, శ్రీనివాస్, రామ్మోహన్, రోహిత్, మహేందర్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, మహిళా నాయకురాళ్లు సునీత, సరిత, సుస్మిత, వీణ, రాజేశ్వరి, మమత, రాధిక, మౌనిక, వైశాలి పాల్గొన్నారు.
Updated Date - Mar 10 , 2025 | 12:58 AM