విజేతలను స్ఫూర్తిగా తీసుకోవాలి
ABN, Publish Date - Jan 27 , 2025 | 01:30 AM
విజేతలను స్ఫూర్తి గా తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత అన్నారు.
సిరిసిల్ల క్రైం, జనవరి 26(ఆంధ్రజ్యోతి): విజేతలను స్ఫూర్తి గా తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత అన్నారు. ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సిరిసిల్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన న్యాయవాదులకు ఆమె బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల వల్ల న్యాయవాదుల్లో స్నేహభావం మరింత పెంపొందుతుంద న్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సృజన, జూనియర్ సివిల్‌జడ్జి గడ్డం మెఘన, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డోర్నాల సంజీవరెడ్డి, కార్యదర్శి వెంక టి, క్రీడల కార్యదర్శి గుడ్ల కిషన్, కోశాధికారి బిట్ల విష్ణు, సీని యర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
Updated Date - Jan 27 , 2025 | 01:30 AM