ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN, Publish Date - Jan 16 , 2025 | 01:03 AM

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ కోరారు. ధర్మపురి పట్టణంలోని ఎంపీడీవో, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. Welfare schemes should be taken advantage of

ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ధర్మపురి, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ కోరారు. ధర్మపురి పట్టణంలోని ఎంపీడీవో, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడుతూ పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ అనేది గొప్ప వరమని అన్నారు. ధర్మపురి మండలంలో 75 మంది లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు. మండలంలో 82 మంది లబిదారులకు రూ 24,11,500 విలువ గల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు. గోదావరి నదిలోకి నీరు విడుదల చేయించడం జరిగిందని, రైతులు లిఫ్ట్‌లు, కరెంట్‌ మోటార్ల ద్వారా సక్రమంగా పంటలు సాగు చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్యమ్మ, తహసీల్దార్‌ కృష్ణచైతన్య, ఎంపీడీవో రవీందర్‌, కౌన్సిలర్లు వేముల నాగలక్ష్మి, సంగనభట్ల సంతోషి, జక్కు పద్మ, గరిగె అరుణ, టీపీసీసీ సభ్యుడు, ధర్మపురి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగనభట్ల దినేష్‌, జిల్లా కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షులు చిలుముల లక్ష్మణ్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు చీపిరిశెట్టి రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సబ్‌ ట్రెజరరీ కార్యాలయం ఏర్పాటుకు కృషి

ధర్మపురి పట్టణంలో సబ్‌ ట్రెజరరీ కార్యాలయం ఏర్పాటు కోసం కృషి చేస్తానని ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు. పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ముద్రించిన 2025 నూతన క్యాలెండర్‌, డైరీని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు బోయిన్‌పెల్లి ఆనందరావు, ప్రధాన కార్యదర్శి యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డితో కలిసి ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారంఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు సబ్‌ ట్రెజరరీ కార్యాలయం ఏర్పాటు చేయాలని వినతిపత్రాన్ని అందించారు. అనంతరం విప్‌ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు ఇందు కోసం ప్రతిపాదనలు పంపిస్తానని తెలిపారు. జగిత్యాల జిల్లా పరిషత్‌లో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల జీపీఎఫ్‌ పార్ట్‌ ఫైనల్‌, లోన్లు బకాయిలు ఇప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలైన మూత్రశాలలు, తాగు నీరు కోసం ప్రతిపాదనలు పంపిస్తానని తెలిపారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు పల్లెర్ల వేణుగోపాల్‌, నాయకులు సంగనభట్ల దత్తాత్రి, బోగ శివప్రసాద్‌, దహెగాం గణేష్‌, పాలెపు వంశీ, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 16 , 2025 | 01:03 AM