ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తాం

ABN, Publish Date - Feb 03 , 2025 | 01:04 AM

రానున్న వేసవికాలన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు సాగు, తాగు నీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. ఫాజుల్‌నగర్‌కు చెరువుకు చేరిన ఎల్లంపల్లి నీటికి నాయకులు, రైతులతో కలిసి ఆదివారం విప్‌ పూజలు నిర్వహించారు.

ఎల్లంపల్లి నీటికి పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌

- నీటికోసం ఎదురుచూసే రోజులు పోయాయి

- రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు

- ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌

వేములవాడ రూరల్‌, ఫిభ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): రానున్న వేసవికాలన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు సాగు, తాగు నీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. ఫాజుల్‌నగర్‌కు చెరువుకు చేరిన ఎల్లంపల్లి నీటికి నాయకులు, రైతులతో కలిసి ఆదివారం విప్‌ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ గతంలో రైతులు రోడ్డెక్కితేనే నీటిని విడుదల చేసే పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు నీటికోసం ఎదురుచూసే రోజులు పోయాయని, వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులకు ముందుగానే నీటిని విడుదల చేశామన్నారు. శ్రీపాద ప్రాజెక్టునుంచి ఎల్లంపల్లి నీరు ఫాజుల్‌నగర్‌ చెరువులోకి చేరుకుందని ఇక్కడి నుంచి మల్యాల, రుద్రంగి చెరువులకు నీటిని విడుదల చేస్తామన్నారు. ఎల్లంపల్లి నీటి ద్వారా ఆయా గ్రామాల్లో చెరువులు కుంటలు నింపుతామని తెలిపారు. పడువుబడ్డ మర్రిపల్లి, కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, గడిచిన 13నెలల్లో 61వేలకోట్లకు పైగా రైతులకు వివిధ రూపాల్లో అందించామని వివరించారు. గతంలో రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాసే పరిస్థితి ఉండేదని ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తేమ శాతం రాగానే కొనుగోలు చేశామని గుర్తుచేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ చైర్మన్‌ రొండి రాజు, పార్టీ మండల అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం, నాయకులు సంఘ స్వామి, సోయినేని కరుణాకర్‌, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2025 | 01:04 AM