అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం
ABN, Publish Date - Jan 23 , 2025 | 01:10 AM
అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజే స్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమ ణారావు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పెద్దపల్లి పట్టణం 10, 22, 34 వార్డుల్లో, సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పూసాల పదమూడో వార్డు సభలో, పెద్దప ల్లి మండలం నిమ్మనపల్లి, కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రం, జూలపల్లి మండలం వడు కాపూర్, ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామాల్లో జరిగిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు.
ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు
పెద్దపల్లిటౌన్/పెద్దపల్లిరూరల్/కాల్వశ్రీ రాంపూర్/జూలపల్లి/సుల్తానాబాద్/ఎలిగే డు, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజే స్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమ ణారావు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పెద్దపల్లి పట్టణం 10, 22, 34 వార్డుల్లో, సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పూసాల పదమూడో వార్డు సభలో, పెద్దప ల్లి మండలం నిమ్మనపల్లి, కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రం, జూలపల్లి మండలం వడు కాపూర్, ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామాల్లో జరిగిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు.
జనవరి 26 నుంచి అమలు చేసే రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను పకడ్బందీగా అమలు చేస్తామ న్నారు. బీఆర్‌ఎస్ పది సంవత్స రాల పాలనలో ఎవరికి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. చివరి ఆయకట్టు ప్రాంతాలకు సాగు నీరు అందించేందకు కృషి చేస్తున్నా మన్నారు. జూ లపల్లి మండలం వడుకాపూర్ గ్రామ పరిధిలోని హుసేమినియా వాగుపై త్వరలోనే బ్రిడ్జి నిర్మాణానికి కృషిచేయను న్నట్లు తెలిపారు. ఉగాది పండుగ నుంచి రేషన్ కార్డులపై ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేసేందు కు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.
ఆయా కార్యక్రమాల్లో పెద్దపల్లి మండల ప్రత్యేక అధికారి ఆర్డీవో గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప, సింగిల్ విండో చైర్మన్లు నర్సింహరెడ్డి, చదువు రామచంద్రారెడ్డి, పుల్లూరి వేణుగోపాల్‌రావు, కాల్వశ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామి డి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, కేడీసీసీబీ డైరక్టర్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన కార్యదర్శి దుగ్యాల సంతోష్ రావు, ఎలిగేడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సామ రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఆయా గ్రామాల ప్రత్యేకఅధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Jan 23 , 2025 | 01:10 AM