ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత

ABN, Publish Date - Jan 26 , 2025 | 12:39 AM

ఓటు హ క్కును వినియోగించుకోవడం అందరి బాధ్యతగా ఉండాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు.

సిరిసిల్ల, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఓటు హ క్కును వినియోగించుకోవడం అందరి బాధ్యతగా ఉండాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. శనివారం 15వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా ఉత్సహంగా నిర్వ హించారు. కలెక్టరేట్‌లో ఉద్యోగులు, సిబ్బందితో ఓటరు దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. ఓటరు దినోత్స వం సందర్భంగా వివిధ సంస్థల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు చైతన్య, నిఖిత, హారిక, రోహిత్‌, సాయికృష్ణ, రాంచరణ్‌, ప్రేమ్‌కు మార్‌లకు బహుమతులు అందించారు. నూతన ఓటర్లకు ఎపిక్‌ కార్డులను అందించారు. సీనియర్‌ సిటిజన్లు, ఓటర్లు, ట్రాన్స్‌జెండర్‌లను సన్మానించా రు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఓటరు నమోదు పెంపు ఎథికల్‌ ఓటింగ్‌, అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జాతీయ ఓటరు దినోత్సవం నిర్వస్తున్నామని అన్నారు. ఈ సంవత్సరం నథింగ్‌ లైక్‌ ఓటింగ్‌, ఐ ఓటింగ్‌ ఫర్‌ ష్యూర్‌ అనే థీమ్‌తో వేడుకలు జరు గుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, జడ్పీ సీఈవో వినోద్‌, సిరిసిల్ల ఇన్‌చార్జి ఆర్డీవో రాధాబాయి, తది తరులు పాల్గొన్నారు.

సిరిసిల్లలో అవగాహన ర్యాలీ..

జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా రాజ న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహిం చారు. అంబేద్కర్‌ చౌరస్తా నుంచి గాంధీచౌక్‌ మీదుగా ర్యాలీ నిర్వహించి ఓటు హక్కు విని యోగంపై అవగాహన కల్పించారు. ఓటు హక్కు పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ చార్జి ఆర్డీవో రాధాబాయి, తహసీల్దార్‌ ఉమారాణి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 26 , 2025 | 12:39 AM