ప్రజా గాయకుడు గద్దర్‌కు ఘన నివాళి
ABN, Publish Date - Feb 01 , 2025 | 12:48 AM
సిరిసిల్ల పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ జయంతి వేడుకలను శుక్ర వారం ఘనంగా నిర్వహించారు.
సిరిసిల్ల టౌన్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ జయంతి వేడుకలను శుక్ర వారం ఘనంగా నిర్వహించారు. గద్దర్ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీ సీసీ సభ్యుడు సంగీతం శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్య క్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, జిల్లా ఉపాధ్యడు వంగ మల్లేశం గౌడ్, మార్కెట్ కమిటి డైరెక్టర్లు దుబాల వెంకటేశం, కాసర్ల రాజు, సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ నీలి రవీందర్, నాయకులు చందన, రమేష్, భాస్కర్ పాల్గొన్నారు. అలాగే సిరిసిల్ల పట్టణంలోని ఓ హోటల్‌లో గద్దర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు రాగు ల రాములు, సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌తో పాటు సోమ నాగరాజు, జక్కుల రామచంద్రం, లక్కం శేఖర్, నారాయణగౌడ్, చంద్రం, సిరిగిరి శ్రీనివాస్, బాలు, రాజేందర్, బాలయ్య, కుమార్ పాల్గొన్నారు.
Updated Date - Feb 01 , 2025 | 12:48 AM