బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి
ABN, Publish Date - Feb 16 , 2025 | 12:52 AM
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సమగ్ర శిక్ష ఉద్యోగుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఇప్పపూల దేవయ్య డిమాండ్ చేశారు.
సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి) : రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సమగ్ర శిక్ష ఉద్యోగుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఇప్పపూల దేవయ్య డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శనివారం సమగ్ర శిక్ష ఉద్యోగుల రాజన్న సిరిసిల్ల జిల్లా సంఘం ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సమగ్ర శిక్ష ఉద్యోగులైన రమేష్, శ్రీనివాస్‌ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ నాయకులు దేవయ్య, ఉపేందర్, కయ్యాం, వెంకటస్వామి, దేవరాజు, నరేందర్, శ్రీనివాస్, మల్లేశం, తిరుపతి, జాగిరి శ్రీనివాస్, చందన్ తదిత రులు పాల్గొన్నారు.
Updated Date - Feb 16 , 2025 | 12:52 AM