ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులకే అందాలి..

ABN, Publish Date - Jan 18 , 2025 | 12:48 AM

కొత్తగా ప్రభుత్వం అమలు చేయనున్న పథకాల లబ్ధిదారులలో పక్కాగా అర్హులైన వారే ఉండాలని అదనపు కలెక్టర్‌ వేణు అన్నారు.

సుల్తానాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): కొత్తగా ప్రభుత్వం అమలు చేయనున్న పథకాల లబ్ధిదారులలో పక్కాగా అర్హులైన వారే ఉండాలని అదనపు కలెక్టర్‌ వేణు అన్నారు. మండలంలోని నర్సయ్యపల్లి, గర్రెపల్లి తదితర గ్రామాల్లో అదనపు కలెక్టర్‌ పర్యటించి ఆయా కొత్త పథకాల కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పరిశీలించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కానీ, భూమిలేని వ్యవసాయ కూలీల ఎంపిక కానీ, రేష న్‌కార్డుల మంజూరీలో కానీ సర్వే పారదర్శకంగా ఉండా లని, ఏ ఒక్క అనర్హున్ని ఎంపిక చేయవద్దన్నారు. ఏ ఒక్క అర్హుడిని వదిలిపెట్టవద్దని అధికారులకు సూచిం చారు. సాగుకు యోగ్యంగా లేని వ్యవసాయ భూముల ను బ్లాక్‌ చేయాలని అన్నారు. అనంతరం సుల్తానాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా అమలుచేయనున్న రైతు భరోసా, రేషన్‌ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, వంటి పథకాల అర్హుల జాబితా వివరాలను శనివారం వరకు పూర్తి అయి అన్ని గ్రామపంచాయతీలలో జాబి తాలను ప్రదర్శించాలన్నారు. ఈ సమావేశంలో తహసీ ల్దార్‌ మధుసూధన్‌రెడ్డి, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2025 | 12:48 AM