రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి
ABN, Publish Date - Feb 18 , 2025 | 12:14 AM
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఎల్‌ఎండి పోలీస్ స్టేషన్‌ను ఆయన సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తిమ్మాపూర్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఎల్‌ఎండి పోలీస్ స్టేషన్‌ను ఆయన సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. ఎన్నికల దృష్ట్యా అన్ని గ్రామాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేటు చేసుకొకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీసులు విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. సమస్యలతో పోలీస్ స్టేషన్ వచ్చే ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో తిమ్మాపూర్ సిఐ స్వామి, ఎల్‌ఎండీ ఎస్సై వివేక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Feb 18 , 2025 | 12:14 AM