ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థులను పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధం చేయాలి

ABN, Publish Date - Feb 09 , 2025 | 12:49 AM

పబ్లిక్‌ పరీక్షలకు విద్యార్థుల ను సన్నద్ధం చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఉపాధ్యాయులను ఆదేశించారు.

సిరిసిల్ల రూరల్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : పబ్లిక్‌ పరీక్షలకు విద్యార్థుల ను సన్నద్ధం చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఉపాధ్యాయులను ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని చిన్నబోనాల సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ విద్యాలయాన్ని కలెక్టర్‌ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వసతిగృహం ఆవరణను పరిశీలించారు. అక్కడినుంచి కిచెన్‌, స్టోర్‌ రూంకు వెళ్లి సరుకుల నాణ్యత, ఆహార పదార్థాలను పరిశీలించి, పలు సూచనలుచేశారు. అనంతరం తరగతి గదుల్లో విద్యార్థులు చదువుతుండగా, వెళ్లి పరిశీలించారు. సిలబస్‌ ఎక్కడి వరకు పూర్తి అయిందని ప్రిన్సిపాల్‌ను ఆరాతీశారు. ఇపకసటికే పూర్తి అయిందని, ప్రస్తుతం రివిజన్‌ చేయిస్తున్నా మని కలెక్టర్‌ దృష్టికి ప్రిన్సిపాల్‌ థెరిసా తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా కలె క్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా మాట్లాడుతూ రానున్న పబ్లిక్‌ పరీక్షల్లో విద్యార్థు లు ఉత్తమ ప్రతిభచూపేలా సిద్ధం చేయాలని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పక్కాప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొ న్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 09 , 2025 | 12:49 AM