ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సాగునీటి కోసం అన్నదాతలతో కలిసి పోరాటం

ABN, Publish Date - Mar 03 , 2025 | 01:03 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం బుద్ది తెచ్చుకో ని రైతులను కాపాడుకోవడా నికి నీళ్లు విడుదల చేయాలని, నీళ్లు విడుదల చేయ కుంటే అన్నదాతలతో కలిపి పోరాటాన్ని ఉధృతం చేస్తామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ హెచ్చ రించారు.

దేవునిగుట్ట తండాలో ఎండిపోయిన పంటను పరిశీలిస్తున్న కేటీఆర్‌

- రైతులను గోస పెట్టవద్దు

- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

- దేవునిగుట్ట తండాలో ఎండిన పంటల పరిశీలన

సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట మార్చి 2 (ఆంధ్ర జ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం బుద్ది తెచ్చుకో ని రైతులను కాపాడుకోవడా నికి నీళ్లు విడుదల చేయాలని, నీళ్లు విడుదల చేయ కుంటే అన్నదాతలతో కలిపి పోరాటాన్ని ఉధృతం చేస్తామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ హెచ్చ రించారు. సిరిసిల్ల జిల్లాలో వందల ఎకరా ల్లో పంట లు ఎండిపోతున్నాయని చూస్తూ ఊరుకోబోమని, 48 గంటల్లో నీళ్లను వదిలిపెట్టకపోతే మంత్రి చాంబర్‌ ఎదుట ధర్నా చేస్తామని కేటీఆర్‌ అన్నారు. ఆదివా రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌లలో పర్యటించా రు. ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండాలో ఎండిపో యిన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న తీరును రైతులు కేటీఆర్‌కు వివరించారు. ఈ సందర్భంగా అయన విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్‌ కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకువచ్చి మల్కపేట రిజర్వాయర్‌లో పోస్తే దేవునిగుట్ట తండాలోని రైతులు వ్యవసాయం చేసేవారని అన్నారు. సిరిసిల్ల ప్రాంతంలో చాలా మంది రైతులు సాగు నీరులేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రస్తుతం మిడ్‌ మానేరులో 16 టీఎంసీల నీళ్లు ఉన్నాయని ఒక టీఎంసీ నీళ్లను మల్కపేట రిజర్వాయర్‌కు వదిలిపెట్టాలని కోరుతు న్నామని అన్నారు. కేసీఆర్‌ అంటే కాళేశ్వరం... కాంగ్రెస్‌ అంటే శనీశ్వరం ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్‌ తెచ్చిన కరువు అన్నారు. కేసీఆర్‌ మీద ఉన్న కోపం, ద్వేషంతో మేడిగడ్డలో జరిగిన కుట్రపూరిత ప్రమా దాన్ని సాకుగాచూపడంతో రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. బీఆర్‌ ఎస్‌ పాలనలో మండు వేసవిలో కూడా సిరిసిల్ల జిల్లాలో ని ఎగువ మానేరు మత్తడి దూకిందని అన్నారు. ఇప్పటికే 450 మంది రైతులను రేవంత్‌రెడ్డి పొట్టన పెట్టుకున్నాడని అన్నారు. కాంగ్రెస్‌చెప్పిన రైతు డిక్లరేషన్‌లో ఒక మాట కూడా నిలబెట్టుకోలేదని రైతు బంధును కూడా వేయడం లేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొ ని రైతులు కాపాడుకోవడానికి వెంటనే నీళ్లు విడుదల చేయాలని అన్నారు.

రైతులకు అండగా బీఆర్‌ఎస్‌...

ముస్బాబాద్‌: రైతులకు అండగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఉంటుందని రైతులు ఎవరు అధైర్య చెందొద్దని బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె తారకరామారావు పేర్కొన్నారు. మండలంలోని పోతుగల్‌ గ్రామంలో జెల్ల దేవయ్య అనే రైతు పంటలు ఎండిపోతున్నాయని కలత చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా కేటీఆర్‌ వారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చారు. పార్టీ తరుపున రూ 2 లక్షల ఆర్థికసాయాన్ని అందించారు. రైతుల కోసం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతు భీమా త్వరలోనే అందుతుందన్నారు. వెంకట్రావుపల్లె గ్రామానికి చెందిన ఆగ్రారం విష్ణు అనే పోలీస్‌ కానిష్టేబుల్‌ బాత్‌రూంలో జారి గుండెపోటుతో మరణించగా ఇంటికి వెళ్లి కేటీఆర్‌ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా పోతుగల్‌, గన్నెవానిపల్లె, సేవాలాల్‌తండా, వెంకట్రావుపల్లెలో పంటలు ఎండిపోతున్నాయని పలువు రు రైతులు కేటీఆర్‌కు ఏకరువు పెట్టారు. భూగర్భ జలాల లు అడుగంటి పోయాయని ధర్నా చేస్తే వారం రోజులు నీళ్లు విడిచి మళ్లీ బందు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో సెస్‌ ఛైర్మన్‌ చిక్కాల రామారావు, బీఆర్‌ ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్‌ డైరెక్టర్‌ అంజిరెడ్డి, పీఏసీఎస్‌ ఛైర్మన్లు తన్నీరు బాపురావు, గుండారపు కృష్ణరెడ్డి, మండల అధ్యక్షుడు సురేందర్‌రావు, డాక్టర్‌ చంద్రశేఖర్‌రావు, మాజీ ఎంపీపీ జనగామ శరత్‌ రావు, మాజీ జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు, తన్నీరు గౌతంరావు, ఎద్దండి నర్సింహరెడ్డి, సర్వర్‌ పాషా, యాది మల్లేశ్‌, అన్వర్‌, చందురావు, సంతోష్‌రావు, నవాజ్‌ పాల్గొన్నారు.

- జూన్‌ కల్లా ఎన్నికలు ..సిద్ధంగా ఉండండి

వచ్చే జూన్‌ కల్లా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కార్యకర్తలు గ్రామాల్లో సిద్ధంగా ఉండా లని కార్యకర్తలకు కేటీఆర్‌ సూచించారు. బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం చేసిన మంచి పనులు, అభివృద్ధిని వివరిస్తూ ప్రస్తు త కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగడుతూ సర్పంచ్‌, ఎంపీటీ సీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Updated Date - Mar 03 , 2025 | 01:03 AM