ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సిరిసిల్ల పట్టణం స్వచ్ఛదనం, పచ్చదనంతో ఉండాలి

ABN, Publish Date - Feb 20 , 2025 | 01:04 AM

సిరిసిల్ల పట్టణం నిత్యం స్వచ్ఛదనం పచ్చదనంతో ఉండాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు.

సిరిసిల్ల టౌన్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల పట్టణం నిత్యం స్వచ్ఛదనం పచ్చదనంతో ఉండాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు, పాత బస్గాండ్‌, సం జీవయ్యనగర్‌, పద్మనగర్‌, వెంకంపేట, కార్గిల్‌లేక్‌, కొత్త బస్టాండ్‌, రైతుబజార్‌, బై పాస్‌ రహదారులు, బతుకమ్మ ఘాట్‌ ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్‌ తనిఖీ చేశారు. సిరిసిల్ల ప్రధాన రహదారుల మధ్యలోని డివైడర్లకు కావాల్సిన మరమ్మత్తులు, మొక్కలు పెంపకం చేపట్టాలని ఆదేశించారు. పట్టణంలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి అన్ని ప్రధానరహదారులతో పాటు కొత్త చెరువు పరిసరాలు శుభ్రం చేయించాలన్నారు. విద్యుత్‌, నీటి సరఫరా పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెరువు వద్ద ఉన్న దుకాణాలన పరిశీలించాలని కొత్త చెరువు లోకి వరదనీరు వెళ్లేందుకు పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించా రు. స్థానికంగా సంజీవయ్య జంక్షన్‌ అభివృద్ధికి డీపీఆర్‌ తయారుచేయాలని పట్ట ణంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్‌ అడ్వర్టైజ్మెంట్‌ పన్ను చెల్లించారా లేదో పరిశీ లించాలని, పన్నులు చెల్లించని వాటిని తొలగించాలని ఆదేశించారు. పట్టణంలో ని అన్ని ప్రాంతాల్లో మురుగు కాలువలను శుభ్రం చేయాలని సూచించారు. వెం ట మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, ఏఈ స్వామి, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Feb 20 , 2025 | 01:04 AM