ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శంభో శంకర

ABN, Publish Date - Feb 26 , 2025 | 12:55 AM

మహా శివరాత్రి పర్వదినాన్ని జిల్లా వాసులు బుధవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు. ఈ సందర్భంగా ఉపవాస దీక్షతో ప్రత్యేక పూజలు, అర్చనలు, జాగరణలు చేస్తారు. జిల్లాలోని శైవక్షేత్రాలు శివరాత్రికి ముస్తాబయ్యాయి. నగరంలోని పాతబజార్‌ గౌరీశంకర, కమాన్‌రోడ్‌ రామేశ్వర, భగత్‌నగర్‌ భవానీశంకర, ఆదర్శనగర్‌ రాజరాజేశ్వర, మాండవ్యనదీ తీరంలోని మార్కండేయ శివాలయం శివరాత్రి శోభను సంతరించుకున్నాయి. బుధవారం జరిగే వేడుకలకు ఆయా ఆలయాల నిర్వాహకులు, అధికారులు, పాలకవర్గం, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. పాతబజార్‌ గౌరీశంకరాలయం వద్ద దర్శనం కోసం వేర్వేరుగా క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేశారు.

మహాశివరాత్రి సందర్భంగా పాతబజారు శ్రీగౌరీశంకర దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన షామియానాలు

కరీంనగర్‌ కల్చరల్‌, ఫిబ్రవరి (ఆంధ్రజ్యోతి) 25: మహా శివరాత్రి పర్వదినాన్ని జిల్లా వాసులు బుధవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు. ఈ సందర్భంగా ఉపవాస దీక్షతో ప్రత్యేక పూజలు, అర్చనలు, జాగరణలు చేస్తారు. జిల్లాలోని శైవక్షేత్రాలు శివరాత్రికి ముస్తాబయ్యాయి. నగరంలోని పాతబజార్‌ గౌరీశంకర, కమాన్‌రోడ్‌ రామేశ్వర, భగత్‌నగర్‌ భవానీశంకర, ఆదర్శనగర్‌ రాజరాజేశ్వర, మాండవ్యనదీ తీరంలోని మార్కండేయ శివాలయం శివరాత్రి శోభను సంతరించుకున్నాయి. బుధవారం జరిగే వేడుకలకు ఆయా ఆలయాల నిర్వాహకులు, అధికారులు, పాలకవర్గం, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. పాతబజార్‌ గౌరీశంకరాలయం వద్ద దర్శనం కోసం వేర్వేరుగా క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేశారు.

ఫ మార్కెట్‌లో సందడి

శివరాత్రి పర్వదిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన మారె ్కట్‌లో కొనుగోళ్ల సందడి కనిపించింది. మంగళవారం రాత్రి వరకు వివిధ గ్రామాల నుంచి అమ్మకందారులు పండుగకు కావాల్సిన వస్తువులను, పూలను, పండ్లను తెచ్చి అమ్మారు. రాత్రి పొద్దుపోయే వరకు కొనుగోళ్లు సాగాయి. మామిడాకు, బంతి, చేమంతులు కూడా బస్తాలకొద్ది తీసుకొవచ్చి రాశులుగా పోసి అమ్మగా ఇక పూలు, పండ్ల ధరలు చుక్కలుు చూపాయి.

Updated Date - Feb 26 , 2025 | 12:55 AM