రహదారుల పనులను వేగవంతం చేయాలి
ABN, Publish Date - Feb 17 , 2025 | 12:53 AM
హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ (హమ్) కింద గ్రామీణ రహదారుల నిర్మాణాలు, మరమ్మతు పనులను వెంట నే చేపట్టి సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధికారుల ను ఆదేశించారు.
ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి) : హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ (హమ్) కింద గ్రామీణ రహదారుల నిర్మాణాలు, మరమ్మతు పనులను వెంట నే చేపట్టి సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధికారుల ను ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట-మరిమడ్ల, మండలంలోని వెంకటాపూర్- ముస్తాబాద్ మీదుగా రాజన్నపేట వరకు విస్తరించే రహదారులను ఆదివారం ఆయన పరిశీలించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పక్కా ప్రణాళికతో పనులను వేగవంతం చేయాలని సూచించారు. హమ్ పథకం కింద గ్రామీణ రోడు,్ల వర్షాలకు కోతకు గురైన రహదారుల నిర్మాణాలు, మరమ్మతులు వల్ల గ్రామీణ ప్రాంతాలు కొత్త రూపును సంతరించుకుంటాయని, పనుల్లో జాప్యంచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వెంట ఆర్ అండ్‌బీ ఈఈ వెంకటరమణయ్య, డీఈ శాంతయ్య, నవీన్, నవ్యశ్రీలు ఉన్నారు.
Updated Date - Feb 17 , 2025 | 12:53 AM