ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ABN, Publish Date - Mar 10 , 2025 | 11:59 PM
వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, మార్చి 10(ఆంధ్రజ్యోతి): వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి ఆర్జీదారుల నుంచి దరఖాస్తులను సోమవారం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువుగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వచ్చిన దరఖాస్తులు..
రెబ్బెన మండలం నంబాల గ్రామానికి చెందిన మసాడె రాజేశ్వరి తన పట్టా భూమికి కొలతలు జరిపి హద్దులు నిర్ధారించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
తిర్యాణి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీలు తమకు ఎన్‌టీఆర్‌ఎస్ సాగర్ ప్రాజెక్టులో చేపలు పెంచడానికి అవకాశం కల్పించాలని కోరారు.
బెజ్జూరు మండలం ముంజంపల్లికి చెందిన శంకర్ పట్టాభూమి నిషేధిత జాబితాలో ఉన్నందున తొలగించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
చింతలమానేపల్లి మండలం కర్జవెల్లి గ్రామానికి చెందిన ఓంకార్ దివ్యాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని వినతిపత్రం అందజేశారు.
బెజ్జూరు మండలం ముంజంపల్లికి చెందిన లచ్చుంబాయి తాను సాగు చేస్తున్న భూమికి పట్టా మంజూరు చేయాలని కోరారు.
చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన గజానంద్ తాను రైతు వేదికలో తాత్కాలిక వాచ్‌మెన్‌గా పని చేసిన కాలానికి జీతం ఇప్పించాలని కోరారు.
కౌటాల మండల కేంద్రానికి చెందిన శంకర్ తనకు సదరం శిబిరంలో దివ్యాంగుడిగా ధ్రువపత్రం జారీ చేయించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
వాంకిడి మండలం దాబా గ్రామానికి చెందిన మురళీ మహేందర్ తనకు దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని అర్జీ పెట్టుకున్నారు.
ఈవీఎం గోదాంల వద్ద పటిష్టమైన రక్షణ చర్యలు
- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, మార్చి 10(ఆంద్రజ్యోతి): జిల్లా కేంద్రంలని ఎలకా్ట్రనిక్ ఓటింగ్ యంత్రాల గోదాం వద్ద పటిష్టమైన క్షణ చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి ఎన్నికల అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈవీఎం యంత్రాలకు పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టడం జరుగుతుందని, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - Mar 10 , 2025 | 11:59 PM