ప్రజాపాలన సభలను పకడ్బందీగా నిర్వహించాలి
ABN, Publish Date - Jan 22 , 2025 | 01:14 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలపై గ్రామ, వార్డుస్థాయిల్లో చేపట్టే ప్రజాపాలన వార్డుసభల ను పకడ్బందీగా నిర్వహించాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలపై గ్రామ, వార్డుస్థాయిల్లో చేపట్టే ప్రజాపాలన వార్డుసభల ను పకడ్బందీగా నిర్వహించాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం రాత్రి జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్, పొంగులేని శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారిలతో కలిసి డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క ప్రజాపాలన గ్రామ, వార్డుసభల నిర్వహణ తీరుపై సమీక్షించారు. జిల్లాలో చేపట్టిన గ్రామ, వార్డుసభల వివరా లను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాను అడిగి తెలుసుకున్నారు. ఏలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అనుగుణంగా సభలను నిర్వహించి దరఖా స్తులను స్వీకరించాలని సూచించారు వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, డీఆర్‌డీవో శేషాద్రి, పౌరసరఫరాల శాఖ అధికారి వసంతలక్ష్మీ, జిల్లా వ్యవసాయ అధికారి అప్జల్‌భేగం, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 22 , 2025 | 01:14 AM