ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలి

ABN, Publish Date - Mar 09 , 2025 | 12:58 AM

ప్రజలకు మరింత ఉత్తమ సేవలు అందించాలని బదిలీపై వెళుతున్న ఎస్పీ అఖిల్‌మహాజన్‌ అన్నారు.

సిరిసిల్ల క్రైం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు మరింత ఉత్తమ సేవలు అందించాలని బదిలీపై వెళుతున్న ఎస్పీ అఖిల్‌మహాజన్‌ అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆవరణలో గల పరేడ్‌ గ్రౌండ్‌లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ గిటే మహేశ్‌బాబా సాహెబ్‌కు స్వాగతం పలికి ఆదిలా బాద్‌కు బదిలీపై వెలుతున్న ఎస్పీ అఖిల్‌ మహాజన్‌కు పోలీసు అధికారులు, సిబ్బంది అత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ మాట్లాడుతూ ప్రజాశాంతి కోసం రాజీపడకుండా తనతో పాటు హోంగార్డుల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరికి కృతజ్ఞతలు తెలిపారు. గడిచిన రెండు సంవత్సరాలు జిల్లాలో పనిచేసే అవకాశం రావడం సంతోషాన్ని ఇచ్చిందని, సమర్థవంతంగా పనిచేసిన మధుర స్మృతులతో బదిలీపై వెళ్లడం అనందంగా ఉందన్నారు. ప్రభుత్వ అధికారులు ఉత్తమ సేవలు అందిస్తే గుర్తింపు పొందుతా రన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది శాంతిభద్రతల పరిరక్షణ కోసం అంకిత భావంతో పనిచేసిన ప్రతి ఒక్కరు అభినందనీయులని అన్నారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, మురళీకృష్ణ, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2025 | 12:58 AM