సాధారణ ప్రసవాలను ప్రోత్సహించండి
ABN, Publish Date - Mar 09 , 2025 | 12:57 AM
తల్లీ, బిడ్డ క్షేమం కోసం వైద్యులు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ ఐఎంఏ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు
సుభాష్‌నగర్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): తల్లీ, బిడ్డ క్షేమం కోసం వైద్యులు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ ఐఎంఏ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ హాస్పిటల్స్‌లో ఆరోగ్య మహిళా బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. లింగ నిర్ధారణ చేయరాదని, అవసరమయినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగులకు సాయం చేయాలన్నారు. ఆసుపత్రుల రిజిస్ట్రేషన్, రెన్యూ వల్స్‌కు తన వంతు సహకారం అందిస్తామ న్నారు. అనంతరం ఐఎంఏ హాలు నుంచి తెలంగాణ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ చౌక్‌లో వైద్యులు, వైద్య విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు ఎనమల్ల నరేష్, కార్యదర్శి నవీన్‌కుమార్, డాక్టర్ విజయ్‌కుమార్, మహిళా విభాగం చైర్‌పర్సన్ డాక్టర్ మాధవి, వైద్యుల చైతన్యరెడ్డి, కిషన్, కవిత, ఎనమల్ల శ్రీదేవి, జాన్సి, హరిత, నవీన, గీత, శేష శైలజ, విద్య, గంగాధర్ పాల్గొన్నారు.
Updated Date - Mar 09 , 2025 | 12:57 AM