ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మేనిఫెస్టోలోని హామీలు అమలుచేయాలి

ABN, Publish Date - Mar 06 , 2025 | 12:59 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం మేనిఫెస్టోలోని హామీలను అమలు చేయాలని, మంత్రివర్గ విస్తరణలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌కు మంత్రిగా అవ కాశం ఇవ్వాలని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవ య్య కోరారు.

సిరిసిల్ల టౌన్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ ప్రభుత్వం మేనిఫెస్టోలోని హామీలను అమలు చేయాలని, మంత్రివర్గ విస్తరణలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌కు మంత్రిగా అవ కాశం ఇవ్వాలని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవ య్య కోరారు. బుధవారం సిరిసిల్ల పట్టనం మున్నూరు కాపు పటేల్‌ కళ్యాణ మండపంలో మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బొప్ప దేవన్న అధ్యక్షతన జిల్లా ముఖ్యనాయకుల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య మాట్లాడా రు. రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వ హించిన జిల్లా విస్తుృత స్థాయి సమావేశంలో మున్నూరు కాపు బిడ్డ ఆది శ్రీనివాస్‌కు ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఏకగ్రీ వంగా తీర్మానం చేసి ముఖ్యమంత్రికి పంపిస్తామన్నారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కమిటీ నుంచి కూడా తీర్మానం చేసి ఆరు నెలలు క్రితం మంత్రిగా ఆది శ్రీనివాస్‌కు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం పది సంవత్సరాల క్రితం కులగణనలో మున్నూరు కాపులు 28లక్షలు ఉన్నారని చూపించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనలో కేవలం 13 లక్షల 60వేల మంది మాత్రమే మున్నూరు కాపులు ఉన్నా రని చూపించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభా 4 కోట్ల 23 లక్షల మందిలో కేవలం మున్నూరు కాపులు మూడున్నర శాతం ఉన్న ట్లు చూపడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి మున్నూరు కాపుల జనాభాపై రీసర్వే చేయించాలని సంఘం పక్షాన కోరుతున్నామన్నారు. మున్నూరు కాపుల సంఖ్య అనేది తగ్గిపోయిందని, రచ్చబండ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ 33 జిల్లా ల్లోని కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చామన్నారు. తెలంగాణ వచ్చాక జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మున్నూరు కాపులు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండే వారని, ప్రస్తుతం తగ్గిపోయారని అన్నారు. గత ప్రభుత్వం మున్నూరు కాపు కార్పొరేషన్‌, బాలబాలికల వసతిగృహాలు, సంఘాలకు స్థలాలను ఇస్తామని మోసం చేసిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మేనిఫెస్టోలోని హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి శంకర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు నామాల పోశెట్టి, జిల్లా మహిళ అధ్యక్షు రాలు కల్లూరి చందన, సిరిసిల్ల, వేములవాడ పట్టణ అధ్యక్షులు అగ్గి రాములు, ఇప్పపూల అజయ్‌, రుద్రంగి మార్కెట్‌ కమిటి చైర్మన్‌ చెలు కల తిరుపతి, నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటి చైర్మన్‌ కచ్చకాయల ఎల్లయ్య, గంభీరావుపేట మార్కెట్‌ కమిటి చైర్మన్‌ కొమిరిశెట్టి విజయ, సిరిసిల్ల మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్‌ కల్లూరి రాజు, సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, సంఘం యూత్‌ జిల్లా అధ్యక్షుడు మారం కుమార్‌, సంఘం జిల్లాలోని వివిధ మండలాల అధ్యక్షులు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2025 | 12:59 AM