ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

peddapalli : యూరియా అమ్మకాలపై నిఘా

ABN, Publish Date - Feb 24 , 2025 | 01:16 AM

జిల్లాలో యూరియా కొరత ఏర్పడకుండా వ్యవసాయ శాఖాధికారులు ఎప్పటి కప్పుడు చర్యలు చేపడుతున్నారు.

జిల్లాలో 2,450 టన్నుల నిల్వలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో యూరియా కొరత ఏర్పడకుండా వ్యవసాయ శాఖాధికారులు ఎప్పటి కప్పుడు చర్యలు చేపడుతున్నారు. ప్రతి రోజు మండల వ్యవసాయ శాఖాధికారులు, సిబ్బంది తమ పరిధిలోని సహకార సంఘాలు, ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి స్టాక్‌ను పరిశీలిస్తున్నారు. ఈ పాస్‌ యంత్రాల ద్వారా అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. యూరియా కొరత ఏర్పడకుండా నిరంతరం నిఽఘా పెడుతు న్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగి సీజన్‌లో 2,23,078 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, ఇతర పంటలను రైతులు సాగు చేశారు. ఇందులో అత్యధికంగా వరి, 2,06,430 ఎకరాలు, మొక్కజొన్న 16 వేల ఎకరాల్లో సాగు చేశారు. సాధారణంగా ఏ పంట అయినా ఎకరానికి 3 బస్తాలు (150 కిలోలు) యూరియాకు మించి రైతు లు వాడరు. దానికంటే అదనంగా 50 వేల బస్తాల యూరియా కలిపి రాష్ట్ర వ్యవ సాయ శాఖకు జిల్లా అధికారులు కావాల్సిన యూరియా అంచనాలు పంపించారు. ఎకరానికి 3 బస్తాల చొప్పున, ఈ సీజన్‌లో సాగు చేసిన పంటలకు 6,70,000 బస్తాలే సరిపోతాయి. కానీ అదనంగా 70 వేల యూరియా బస్తాలు అంటే 3,500 టన్నుల యూరియాతో కలిపి జిల్లాకు 37,000 టన్నుల యూరియా అవసరం ఉంటుందని ప్రభుత్వానికి నివేదించారు. ఆ మేరకు సీజన్‌ ఆరంభమైన గత ఏడాది అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు జిల్లాకు 33,201 టన్నుల యూరియా వచ్చింది. ప్రస్తుతం 2,43,4.21 టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి. అంతర్గాం మంలంలో 28.1 టన్నులు, ధర్మారం మండలంలో 103.4 టన్నులు, ఎలిగేడు మండ లంలో 135.2 టన్నులు, జూలపల్లి మండలంలో 71.2 టన్నులు, కమాన్‌పూర్‌ మండలంలో 43.7 టన్నులు, మంథని మండలంలో 84.5 టన్నులు, ఓదెల మండ లంలో 42.3 టన్నులు, పాలకుర్తి మండలంలో 20.25 టన్నులు. పెద్దపల్లి మండ లంలో 435.6 టన్నులు, రామగిరి మండలంలో 39.4 టన్నులు. రామగుండం మండలంలో 21.26 టన్నులు, కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో 87 టన్నులు, సుల్తా నాబాద్‌ మండలంలో 167.8 టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఎక్కువగా మార్క్‌ఫెడ్‌ ద్వారా వ్యవసాయ సహకార సంఘాలు, డీసీ ఎంఎస్‌లు, రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా విక్రయిస్తున్నారు. జిల్లాలోని రామగుండంలో గల ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తి అవుతున్న భారత్‌ బ్రాండ్‌ యూరి యాను మార్క్‌ఫెడ్‌కు సరఫరా చేస్తున్నారు. ప్రైవేట్‌ ఎరువుల దుకాణాలకు ప్రైవేట్‌ కంపెనీల్లో ఉత్పత్తి అయ్యే యూరియాను విక్రయిస్తున్నారు. సహకార సంఘాలు, వ్యాపారులు యూరియాను పక్కదారి పట్టకుండా ఉండేందుకు వ్యవసా యాధి కారులు ఎప్పటికప్పుడు దుకాణాలను సందర్శించి స్టాక్‌ పరిశీలిస్తున్నారు. ఈ పాస్‌ యంత్రాల ద్వారా కాకుండా ఒక్క యూరియా బస్తా కూడా బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం యూరియా 2,434.41 టన్నులు నిల్వ ఉండ గా, ఇంకా 3,800 టన్నుల యూరియా జిల్లాకు రావాల్సి ఉంది. ఎరువుల సరఫరా నెల వారీగా అవుతుంటాయి. మార్చి 15వ తేదీకల్లా ఈ సీజన్‌కు రావాల్సిన యూ రియా మొత్తం సరఫరా కానున్నదని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.

అధికంగా యూరియా వాడవద్దు

- దోమ ఆదిరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి

ఏ పంటకైనా మోతాదుకు మించి అధికంగా యూరియా వాడితే తెగుళ్లు వస్తాయి. జిల్లాలో అత్యధికంగా వరిసాగు చేశారు. వరి పంటకు రెండున్నర బస్తాలు 125 కిలోలకు మించి వాడవద్దు. అంతకు మించి వాడితే వరికి అగ్గి తెగులు వస్తుంది. దీంతో పంట ఎదగదని, తద్వారా పంట దిగుబడులు తగ్గుతా యి. జిల్లాలో యూరియా కొరత లేదు. రైతులు ఆందోళన చెందవద్దు. ఎరువులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - Feb 24 , 2025 | 01:16 AM