ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వేలంలో పాల్గొని సింగరేణిని రక్షించండి

ABN, Publish Date - Mar 10 , 2025 | 12:48 AM

కేంద్రం నిర్వహించే బొగ్గు బ్లాక్‌ల వేలంలో సింగరేణి పాల్గొనాల్సిన అనివార్యతను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర పరిధిలోని గనులను దక్కించుకునేలా ప్రభుత్వం సహకరించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను సింగరేణి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయ కులు కోరారు.

డిప్యూటీ సీఎంతో మాట్లాడుతున్న జనక్‌ప్రసాద్‌, సీతారామయ్య

- కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి

- డిప్యూటీ సీఎంతో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నేతలు

గోదావరిఖని, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): కేంద్రం నిర్వహించే బొగ్గు బ్లాక్‌ల వేలంలో సింగరేణి పాల్గొనాల్సిన అనివార్యతను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర పరిధిలోని గనులను దక్కించుకునేలా ప్రభుత్వం సహకరించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను సింగరేణి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయ కులు కోరారు. ఆదివారం ప్రజాభవన్‌లో ఐఎన్‌ టీయూసీ సెక్రెటరీ జనరల్‌ జనక్‌ప్రసాద్‌, ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య డిప్యూ టీ సీఎంను కలిశారు. ఈసందర్భంగా సింగరేణి విషయాలపై చర్చించారు. వేలంలో పాల్గొనకుం టే బొగ్గు బ్లాక్‌లు ఇతర సంస్థలు చేజిక్కుంచే కునే అవకాశాలు ఉన్నాయని, దీంతో సింగరేణికి తీవ్రం నష్టం జరుగుతందని తెలిపారు.

వేలంలో పాల్గొనకపోవడం ద్వారా కోయగూడెం, సత్తుపల్లి గనులు ప్రెవేట్‌ సంస్థకు దక్కాయని తెలిపారు. ఈరెండు గనులు సింగరేణికి వచ్చి ఉంటే ఏడాదికి ఆరు మిలియన్‌ టన్నుల బొగ్గు అదనంగా వచ్చేదని అన్నారు. సింగరేణికి పుట్టినిల్లు లాంటి ఇల్లందు ఏరియాలో గనులు మూతపడి గత వైభవా న్ని కోల్పోతున్నదని, ఇటువంటి తరుణంలో కోయగూ డెం బ్లాక్‌ను గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో ప్రైవేట్‌ సంస్థ దక్కించుకున్నట్టు వారు తెలిపారు. కోయగూడెం సింగరేణికి వచ్చి ఉంటే ఏడాదికి మూడు మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసేదని, 20 ఏళ్లకు సరిపడా నిల్వలు ఉన్న బ్లాక్‌ చేజారిపోవ డం వలన సింగరేణితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగినట్టు జనక్‌ప్రసాద్‌, సీతారామయ్య తెలిపారు. సత్తుపల్లి బ్లాక్‌ను దక్కించుకునే అవకాశం వచ్చినా గతప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చేజారిపో యినట్టు వారు పేర్కొన్నారు. గత ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల కారణంగా సింగరేణికి రావాల్సిన రెండు కీలక బొగ్గు బ్లాక్‌లు నష్టపోయినట్టు వివరించారు. వేలం ద్వారా సింగరేణి బొగ్గు బ్లాక్‌లను దక్కించు కుంటే ప్రభుత్వంతో పాటు వినియోగదారులకు మేలు జరుగుతందని తెలిపారు. వేలం ప్రక్రియ ద్వారా గనులు పొందితే 18.5 శాతం పన్ను చెల్లించాలన్సి ఉం టుందని, అదే కేటాయింపుల ద్వారా జరిగితే 28 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుందని తెలిపా రు. దీని ద్వారా కంపెనీకి టన్ను బొగ్గు మీద రూ.198 ఆదా అవు తుందని జనక్‌ప్రసాద్‌, సీతారామయ్య పేర్కొ న్నారు. తక్కువ ధరకు విద్యుత్‌ సంస్థలకు బొగ్గు సరఫరా చేసే అవకాశం ఉం టుందని తెలిపారు. కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిం చాలని డిప్యూటీ సీఎంను కోరారు. సొంతింటి పథకం అమలు చేయడం, పెర్క్స్‌ మీద ఐటీ రీయింబర్స్‌ చేయడం వంటివి అమలు జరిగేలా చూడాలని డిప్యూటీ సీఎంని కోరారు. సింగరేణికి అన్నివిధాల సహకరిస్తామని త్వరలో కార్మిక సంఘాలతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి, సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమాని అవసరమైన అంశాలపై చర్చిస్తామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు. డిప్యూటీ సీఎంని కలిసిన వారిలో గుర్తింపు, ప్రాతిని ధ్య సంఘాల నాయకులు నర్సింహారెడ్డి, వైవీ రావు, మడ్డి ఎల్లయ్య, త్యాగరాజన్‌, సమ్మయ్య, శంకర్‌రావు, వికాస్‌ కుమార్‌, జిగురు రవీందర్‌, బాజీ సైదా ఉన్నారు.

Updated Date - Mar 10 , 2025 | 12:48 AM