ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పోషకాహారం తీసుకుంటేనే ఆరోగ్యం

ABN, Publish Date - Feb 15 , 2025 | 12:59 AM

బాలింతలు, గర్భిణీలు పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి సబితకుమారి సూచించారు. మండలంలోని వన్నారం గ్రామంలో శుక్రవారం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం సభ జరిగింది.

వన్నారంలో అన్నప్రాసన నిర్వహిస్తున్న సబితకుమారి

- జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి సబితకుమారి

మానకొండూర్‌, పిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : బాలింతలు, గర్భిణీలు పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి సబితకుమారి సూచించారు. మండలంలోని వన్నారం గ్రామంలో శుక్రవారం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం సభ జరిగింది. ఈ సభలో ఆమె మాట్లాడుతూ బాలికల పట్ల వివక్షత చూపరాదని, లింగ నిర్థారణ పరీక్షల కోసం ఒత్తిడి చేస్తే 1098 హైల్ప్‌లైన్‌కు కాల్‌ చేయాలన్నారు. అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన తర్వాతనే వివాహం చేయాలని లేకుంటే చట్టం తీసుకునే చర్యలకు బాధ్యులు అవుతారని అన్నారు. వరకట్న నిషేధ, గృహహింస చట్టాలపై అవగాహన కల్పించారు. ఉమెన్‌ హెల్ప్‌లైన్‌, 181, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098, వృద్ధుల హెల్ప్‌లైన్‌ 14567, సైబర్‌క్రైమ్‌ టోల్‌ఫ్రీ నెంబరు 1930 సేవలను వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అందుతున్నాయన్నారు. బాలికలు, మహిళలు ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ చిన్నారుల నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనిసెఫ్‌ జిల్లా కో-ఆర్డినేటర్‌ కిషన్‌స్వామి, ఇన్‌చార్జి సీడీపీవో శ్రీలత, ఎంపిడివో వరలక్ష్మీ, ఎంఈవో మధుసుధనాచారి, కిశోర బాలికలు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 12:59 AM