ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA Kavvampally:మానకొండూర్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

ABN, Publish Date - Jan 24 , 2025 | 11:41 PM

మానకొండూర్‌, జనవరి 24(ఆంధ్రజ్యోతి): మానకొండూర్‌ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.

మానకొండూర్‌, జనవరి 24(ఆంధ్రజ్యోతి): మానకొండూర్‌ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆయన సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డితో కలిసి శుక్రవారం మానకొండూర్‌ పంచాయతీ పరిధిలోని డ్రైనేజీ వ్యవస్థ, మినీ ట్యాంక్‌బండ్‌పై చేపట్టిన సుందరీకరణ పనులను పరిశీలించారు. అనంతరం గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మురికి కాల్వల నిర్మాణానికి రూ.22లక్షలు, చెరువు కట్టకు ఇరువైపులా జంగల్‌ కటింగ్‌కు మరో రూ.2లక్షలు మంజూరు చేస్తామన్నారు. కట్టపై హైమాస్‌ లైట్లను ఎమ్మెల్యే నిధులు, సుడా నిధులతో ఏర్పాటు చేస్తామన్నారు. జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో రెండు మినీమస్టర్‌లు, ఎనిమిది హైమాస్‌ లైట్లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ మర్రి ఓదెలు, మండల అధ్యక్షుడు నందగిరి రవీంద్రాచారి, డీసీసీ ప్రధానకార్యదర్శి తాళ్లపల్లి సంపత్‌గౌడ్‌, మండల యూత్‌ అధ్యక్షుడు కోండ్ర సురేష్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 24 , 2025 | 11:41 PM