ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మెగా లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

ABN, Publish Date - Feb 21 , 2025 | 02:41 AM

మార్చి 8న నిర్వహించే జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌, జిల్లా జడ్జి ఎన్‌ ప్రేమలత అన్నారు.

సిరిసిల్ల క్రైం, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): మార్చి 8న నిర్వహించే జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌, జిల్లా జడ్జి ఎన్‌ ప్రేమలత అన్నారు. గురువారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యం లో జిల్లా కోర్టులో పీపీలు, పోలీస్‌ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేషనల్‌ లోక్‌ అదాలత్‌లో అధిక సంఖ్య లో కేసులను పరిష్కరించాలని కోరారు. దాదాపు 1200కు పైగా పెండింగ్‌ కేసులు ఉన్నాయని, ఇందులో పోలీస్‌ స్టేషన్‌ల వారీగా తమ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆమె అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ డి చంద్రయ్య, సీనియర్‌ సివిల్‌ జడ్జిలు లక్స్మణ చారి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు ఏ ప్రవీణ్‌, సృజన, జ్యోతిర్మయి, జయశ్రీ, మేఘన, ఏపీపీలు విక్రాంత్‌, సతీష్‌ సందీప్‌, అదనపు పీపీ పెంట శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

Updated Date - Feb 21 , 2025 | 02:41 AM