ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కన్నుల పండువగా మార్కండేయ స్వామి శోభాయాత్ర

ABN, Publish Date - Feb 02 , 2025 | 01:00 AM

విఠలా... విఠలా.. పాండురంగా అంటూ శివభక్త మార్కండేయస్వామి నామస్మరణతో శోభాయాత్ర కన్ను ల పండుగగా సాగింది.

సిరిసిల్ల, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి) : విఠలా... విఠలా.. పాండురంగా అంటూ శివభక్త మార్కండేయస్వామి నామస్మరణతో శోభాయాత్ర కన్ను ల పండుగగా సాగింది. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ శివభక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీమార్కండేయ స్వామి దేవస్థానంలో స్వామివారి మహాయజ్ఞం నిర్వహించారు. సాయంత్రం పద్మశాలీలు, మహిళల జనసందోహాం మధ్య వైభవోపేతంగా మార్కండేయ స్వామి శోభాయాత్ర నిర్వహించారు. ప్రత్యేక వాహనంపై మార్కండేయ స్వామి ఉత్సవ విగ్రహంతో మార్కండేయ దేవస్థానం నుంచి బయలు దేరిన యాత్ర గాంధీచౌక్‌, అంబేద్కర్‌ చౌరస్తా, చేనేత చౌక్‌, పెద్దబజార్‌ మీదుగా వెంకటేశ్వర స్వామి దేవాలయం మీదుగా కొనసాగింది. శోభా యాత్రకు తరలివచ్చిన పద్మశాలీలు, మార్కండేయ స్వామి భక్తులు అడు గడుగునా నృత్యాలు చేస్తూ మార్కండేయ నామ స్మరణ చేశారు. శోభా యాత్రలో పద్మబ్రహ్మణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్ర లో గాంధీ, అంబేద్కర్‌, నేతన్న విగ్రహాలకు పూలమాలలు వేశారు. జయం తి ఉత్సవాలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోలి వెంకటరమణ, కార్యదర్శి మండల సత్యం, జిల్లా అధ్యక్షుడు గాజుల బాలయ్య, కాంగ్రెస్‌ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్‌రెడ్డి, అర్భన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ రాపెల్లి లక్ష్మీనారాయణ ,పవర్‌లూం టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అడెపు రవీందర్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, చేనేత వస్త్రవ్యాపార సంఘం అధ్యక్షుడు తాటిపాముల దామోదర్‌, పద్మశా లి యువజన సంఘం అధ్యక్షుడు గుండ్లపల్లి పూర్ణచందర్‌, పద్మశాలి మహిళ సంఘం అధ్యక్షురాలు కాముని వనిత,కాంగ్రెస్‌ పట్టణ మాజీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, పద్మశాలి సంఘం ప్రతినిధులు బొల్లి రామ్మోహన్‌, డాక్టర్‌ గాజుల బాలయ్య, యెల్లె లక్ష్మీనారాయణ, మ్యాన రవి, మోర రవి, వెల్దండి దేవదాస్‌, గుజ్జెతార, అడెపు చంద్రకళ, దార్నం అరు ణ, కట్టెకోల లక్ష్మీనారాయణ, పిస్క మదు, వస్త్ర పరిశ్రమ అనుబంధ సం ఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2025 | 01:00 AM