ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉజ్వల భవిష్యత్తు అందించేలా గురుకులాల నిర్వహణ

ABN, Publish Date - Jan 03 , 2025 | 12:47 AM

: పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించేలా జిల్లాలోని గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్‌, కేజీబీవీలను నిర్వహించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధికారులను ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

- కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

సిరిసిల్ల కలెక్టరేట్‌, జనవరి 2 (ఆంధ్రజ్యో తి): పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించేలా జిల్లాలోని గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్‌, కేజీబీవీలను నిర్వహించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో రాజన్నసిరిసిల్ల జిల్లాలోని రెసిడెన్షియల్‌ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్‌ పర్యవేక్షణపై అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయ క్‌తో కలిసి సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్‌, ఏకలవ్య మోడల్‌ స్కూల్స్‌, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ఇక నుంచి జిల్లా యంత్రాం గం పర్యవేక్షిస్తుందన్నారు. జిల్లాలోని ప్రతి కేజీబీవీ నిర్వహణలో ఆయా మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పర్యవేక్షిం చాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లాలోని బాలికా రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కేజీబీవీల్లో మహిళా సిబ్బంది మాత్రమే విధులు నిర్వహించేలా చూడా లని తెలిపారు. రానున్న 15 రోజుల్లో రెసిడెన్షియల్‌ పాఠశాలలు ప్రభుత్వ హాస్టల్స్‌లో చదివే విద్యార్థుల కు ప్రతీనెలా వైద్యపరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ తయారు చేయాలని ఆదేశించారు.

హాస్టల్స్‌లో పిల్లలకు అవసరమైన కనీస సదుపా యాల కల్పనకు చర్యలు చేపట్టాలని, డార్మంటరీలో పిల్లల సంఖ్య అనుగుణంగా అవసరమైన మంచా లు, దుప్పట్లు అందుబా టులో ఉండేలా చూడాలన్నారు. పిల్లలకు డైనింగ్‌ ఏర్పాట్లు, హాస్టల్స్‌, పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని సూచించా రు. రెసిడెన్షి యల్‌ పాఠశాలల్లోని స్టోర్‌ రూమ్‌, క్లీనింగ్‌ ఏరియా, వంట గది పరిసరాలు పరిశుభ్రం గా ఉండేలా చూడాలన్నారు. గురు కులాలు, మోడ ల్‌ స్కూల్స్‌, కేజీబీవీల్లో పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం చేయవద్దని జిల్లా విద్యాశాఖ అధికారికి సూచించా రు. పిల్లలకు అందించే ఆహార నాణ్యతలో రాజీ పడవ ద్దని ఒక సారి వినియోగించిన నూనె మరొక సారి వాడవద్దని సూచించారు. ఉపాధ్యాయులు కొరత ఎక్కడ ఉన్నా వెంటనే తెలియ జేయాలన్నా రు. ప్రభుత్వం నిర్ధేశించిన కామన్‌ డైట్‌ ప్రకారం సరుకులు సరఫరా చేయని పక్షంలో కాంట్రాక్టర్‌ను మార్చాలని సూచించారు. గురుకులాల నిర్వహణ సంబంధించి ఎదురయ్యే చిన్నచిన్న సమస్యలను ఎప్పటికప్పుడు మండల స్థాయిలో పరిష్కరించు కోవాలని ఆదేశించారు. సమావేశంలో వేములవాడ రెవెన్యూ డివిజన్‌ అధికారి రాజేశ్వర్‌, డీఈవో జగన్మో హన్‌రెడ్డి, ఎస్‌డీసీ రాదాబాయి, మండల ప్రత్యేక అధికారులు ఆర్‌సీవోలు ప్రిన్సిపల్స్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2025 | 12:47 AM