ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైతులపై కేటీఆర్‌ మొసలి కన్నీరు

ABN, Publish Date - Mar 03 , 2025 | 01:08 AM

ఎదో శుభకార్యానికి వచ్చి కేటీఆర్‌ రైతులతో మాట్లాడి మొసలి కన్నీరు కారుస్తు న్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డిపేట మండలంలో పంటల పరిశీలన పేరుతో కేటీఆర్‌ మాట్లాడిన వ్యాఖ్యలపై ఆయన స్పందిం చారు.

మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

- ప్రభుత్వ విప్‌ అది శ్రీనివాస్‌

సిరిసిల్ల, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ఎదో శుభకార్యానికి వచ్చి కేటీఆర్‌ రైతులతో మాట్లాడి మొసలి కన్నీరు కారుస్తు న్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డిపేట మండలంలో పంటల పరిశీలన పేరుతో కేటీఆర్‌ మాట్లాడిన వ్యాఖ్యలపై ఆయన స్పందిం చారు. విలేకరులతో మాట్లాడుతూ కేటీఆర్‌ సిరిసిల్లకు అమావాస్య పున్నానికి వస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన మాటాలు చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని అన్నారు. పడావు పడ్డ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తున్నామని, మల్కపేట ప్రాజెక్ట్‌ నుంచి సిరిసిల్ల నియోజకవర్గంలో ఎల్లారెడ్డిపేటకు 0.2 టీఎంసీల నీళ్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. కాళేశ్వరం ఉండి ఉంటే కేసీఆర్‌ నీళ్లు వదిలిపెడితే దేవునిగుట్ట వరకు నీళ్లు పోతాయని కేటీఆర్‌ మాట్లాడిన మాట శుద్ధ అబద్ధమని అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మల్కపేట రిజర్వాయర్‌ నుంచి చుక్కనీరు దేవునిగుట్ట వరకు కాదు కిందివరకు కూడా విడుదల చేయ లేదన్నా రు. మల్కపేట రిజర్వాయర్‌ పనులు చేసిన వారికి రూ. 11 కోట్లు బకాయి పెడితే కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. చిరువ్యాపారులకు తాము వ్యతిరే కం కాదని టీస్టాల్‌ విషయం లో కేటీఆర్‌ బొమ్మ ఉంటే ఎన్నికల కోడ్‌ సమయంలో మీరు తప్పు అనాల్సింది పోయి దానిని కూడా రాజకీయం చేస్తున్నార ని ఎన్నికల కోడ్‌లో మహానీయుల విగ్రహాలకే ముసుగు వేస్తున్నారని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రెండువేల ఎకరాల ప్రభుత్వ భూములు దోచిపెడితే కాంగ్రెస్‌ ప్రభు త్వం తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమచేసిందని తెలిపా రు. పట్టణంలో నేను దోచుకుంటా పల్లెల్లో మీరు దోచుకోండి అన్న చందాన కేటీఆర్‌ మాట్లాడిన తీరు ఉందని అన్నారు. కేసీఆర్‌ అంటే మీరు కాళేశ్వరం అంటు న్నారు. అది కూళేశ్వర్‌రావు అయిందన్నారు. మీరే కాళేశ్వ రం పర్రె పడిందని ఒప్పుకున్నారన్నారు. కాళేశ్వరంలో నీటిని అపితే డ్యాం కూలిపోతుందని అధికారులు చెప్పా రని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరా న్ని ఏటీఎంగా మార్చుకున్నారని విమర్శించారు. కాళేశ్వరం చుక్కనీరు వాడకుండా గతంలో కాంగ్రెస్‌ కట్టిన ప్రాజెక్ట్‌లతో వానాకా లంలో రైతులు వడ్లు పండిం చారని అన్నారు. ఎగువ మానేరుకు అర టీఎంసీ నీటిని విడుదల చేశామని తెలిపారు. 25 లక్షల రైతు కుటుంబా లకు ఏకకాలంలో రుణమాఫీ చేశామని అన్నారు.

Updated Date - Mar 03 , 2025 | 01:08 AM