ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Karimnagar: ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల డిగ్రీ మొదటి సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

ABN, Publish Date - Feb 13 , 2025 | 10:43 PM

గణేశ్‌నగర్‌,ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్‌, సైన్స్‌ అటానమస్‌ కళాశాల డిగ్రీ మొదటి సెమిస్టర్‌ ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కె. రామకృష్ణ, శాతవాహన యూనివర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌

గణేశ్‌నగర్‌,ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్‌, సైన్స్‌ అటానమస్‌ కళాశాల డిగ్రీ మొదటి సెమిస్టర్‌ ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కె. రామకృష్ణ, శాతవాహన యూనివర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ శ్రీరంగ ప్రసాద్‌, కళాశాల కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ్స డాక్టర్‌ తిరుకోవెల శ్రీనివాస్‌, అధ్యాపకుల బృందంతో కలిసి గురువారం విడుదల చేశారు. ఈ సందర్భం గా కళాశాల ప్రిన్సిపల్‌ రామకృష్ణ మాట్లాడుతూ కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ లైఫ్‌ సైన్సెస్‌, బీఎస్సీ ఫిజికల్‌ సైన్సెస్‌ బీఎస్సీ హానర్స్‌, బీసీఏ బీబీఏ మొదలైన కోర్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ తిరుకోవెల శ్రీనివాస్‌ మాట్లాడుతూ మొదటి సెమిస్టర్‌లో 1346 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 521 మంది విద్యార్థులు 38.7 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. కళాశాల వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చని తెలిపారు.

Updated Date - Feb 13 , 2025 | 10:43 PM