ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Karimnagar: నిర్మలమ్మ బడ్జెట్‌పై మిశ్రమ స్పందన

ABN, Publish Date - Feb 02 , 2025 | 12:34 AM

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌) కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పలు పార్టీల నాయకులు మిశ్రమ స్పందన వెలిబుచ్చారు.

- దేశగతిని మార్చే బడ్జెట్‌ అన్న బీజేపీ నాయకులు

- రాష్ట్రానికి ఎటువంటి కేటాయింపులు లేవంటున్న కాంగ్రెస్‌

- సామాన్యులకు ఒరిగేదేమీ లేదన్న బీఆర్‌ఎస్‌

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పలు పార్టీల నాయకులు మిశ్రమ స్పందన వెలిబుచ్చారు. దేశగతిని మార్చి, పేద ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత, రైతులకు అన్ని విధాల ఉపయోగకరమైన బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారని బీజేపీ నాయకులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులున్నా తెలంగాణ ప్రయోజనాలకనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులు లేవని కాంగ్రెస్‌ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి బడ్జెట్‌లో సాధించిదేమి లేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకు రావడంలో పూర్తి విఫలమయ్యారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో కరీంనగర్‌ రైల్వే లైన్లకు మొండి చేయి చూపించారని బీఆర్‌ఎస్‌ నాయకులు అభిప్రాయ పడ్డారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కరీంనగర్‌కు నిరాశనే మిగిల్చిందన్నారు. వామ పక్ష పార్టీల నాయకులు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పెదవి విరిచాయి. పేదలు, కార్మికులు, మహిళా సాధికారతకు బడ్జెట్‌ కేటాయింపులు లేవని, సామాన్య ప్రజలకు బడ్జెట్‌తో ఒరిగిందేమి లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విద్యారంగాన్ని పూర్తిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విస్మరించారని, కేంద్ర బడ్జెట్‌లో కరీంనగర్‌లో ఐఐఐటీ ఏర్పాటు అంశమే ప్రస్తావించలేదన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పలు పార్టీలు, సంఘాల నాయకులు మిశ్రమ స్పందన వెలిబుచ్చారు.

Updated Date - Feb 02 , 2025 | 12:34 AM