Karimnagar: చివరి ఆయకట్టుకు చేరిన మిడ్ మానేరు నీరు
ABN, Publish Date - Feb 01 , 2025 | 10:57 PM
సైదాపూర్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): మిడ్ మానేరు కుడికాలువ నీరు ఎట్టకేలకు చివరి ఆయకట్టు వరకు చేరుకున్నాయి.
- ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
సైదాపూర్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): మిడ్ మానేరు కుడికాలువ నీరు ఎట్టకేలకు చివరి ఆయకట్టు వరకు చేరుకున్నాయి. ‘ఆంధ్రజ్యోతి’లో ఈ నెల 18న ‘చివరి ఆయకట్టుకు చేరని మిడ్ మానేరు నీరు’ అనే కథనం ప్రచురితమయింది. దానికి స్పందించిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే కాలువ పనులు పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలని అధికారులను ఆదేశించారు. వారు పనులు చేపట్టారు. శనివారం పనులు పూర్తి కావడంతో మండలంలోని చివరి ఆయకట్టు అయిన ఎల్లంపల్లి, గుజ్జులపల్లి, గొడిశాల వరకు నీరు చేరుకున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్య గుర్తించి వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - Feb 01 , 2025 | 10:57 PM