ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

jagityaala : ఇంటర్‌లో ప్రవేశాల పెంపునకు కార్యాచరణ

ABN, Publish Date - Mar 10 , 2025 | 12:58 AM

జగిత్యాల, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల పెంపునకు అధ్యాపకులు కార్యాచరణ రూపొందించారు.

-ప్రచారం చేపట్టిన ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు

-జిల్లాలో ఇప్పటికే 3 వేలకు పైగా విద్యార్థుల గుర్తింపు

-ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన

జగిత్యాల, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల పెంపునకు అధ్యాపకులు కార్యాచరణ రూపొందించారు. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పాటు వసతి గృహాల్లో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థులు ప్రభుత్వ జూనియర్‌ క ళాశాలల బాట పట్టించేందుకు కృషి చేస్తున్నారు. వివిధ కారణాలతో ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరంలో చేరుతున్న వారి సంఖ్య యేటేటా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో అడ్మిషన్ల పెంపుపై ఇంటర్‌ బోర్డు దృష్టి సారించింది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జూనియర్‌ లెక్చరర్లు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ అడ్మిషన్లను పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఫమెరుగైన వసతులు

ప్రస్తుత విద్యా సంవత్సరంలో సుమారు పది వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉన్నత విద్య పూర్తి చేసిన నిపుణులైన అధ్యాపకులు ఉన్నారు. తెలుగు, ఇంగ్లీషు మీడియాల్లో పలు కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. గతంలో పోల్చితే వసతులు, బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెరిగాయి. కళాశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. వార్షిక పరీక్షలపైనే కాకుండా విషయ పరిజ్ఞానంపై దృష్టి సారించి విద్యార్థులకు బోధిస్తున్నారు. కొందరు లెక్చరర్లు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ కళాశాలల్లో లభించే సౌకర్యాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ఆంగ్లం, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో కళాశాలల్లో ఉన్న కోర్సుల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఎంసెట్‌, ఐఐటీ, నీట్‌ వంటి ఉన్నత పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ తరగతుల గురించి తెలియజేస్తున్నారు.

ఫఉన్నత పాఠశాలల్లో వివరాల సేకరణ

జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు స్థానిక ప్రైవేటు కళాశాలతో పాటు కరీంనగర్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌ వంటి పట్టణాలలో ఇంటర్‌ పూర్తి చేస్తున్నారు. దీంతో మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. పలు ప్రైవేటు కళాశాలల యజమాన్యాలు వేసవి నుంచే ప్రచారం చేస్తూ విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నాయి. ఈ ఏడాది ప్రభుత్వ ఉన్నతాధికారుల కూడా 2025-26 విద్యా సంవత్సరం ప్రవేశాలపై ముందస్తు కార్యాచరణ రూపొందించారు. ప్రతీ కాలేజీలో 25 నుంచి 40 శాతం ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామాల్లో డ్రాపౌట్స్‌ లేకుండా కార్యాచరణ సిద్ధం చేశారు. ఉన్నత పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల వివరాలతో పాటు తల్లిదండ్రుల పేర్లు, వారి మొబైల్‌ నంబర్లు నమోదు చేసుకుంటున్నారు. ఇలా సేకరించిన వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. ఇప్పటికే సుమారు మూడు వేల మంది విద్యార్థులను గుర్తించినట్లు తెలుస్తోంది.

ఫజిల్లాలోని కళాశాలలు..

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలతో పాటు కస్తూర్బా, ఇతర గురుకుల జూనియర్‌ కళాశాలలు 47 వరకు ఉన్నాయి. ఇందులో 15 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, 13 మోడల్‌ కళాశాలలు, 5 మైనార్టీ జూనియర్‌ కళాశాలలు, 5 కస్తూర్బా జూనియర్‌ కళాశాలలు, 3 మహాత్మా జ్యోతిబాఫూలే జూనియర్‌ కళాశాలలు, 6 గురుకుల జూనియర్‌ కళాశాలలున్నాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సుమారు సుమారు 9 వేలకు పైగా విద్యార్థులు అభ్యసిస్తున్నారు. అదేవిధంగా సుమారు రెండు వేల వరకు రెసిడెన్షియల్‌, మైనార్టీ, బీసీ తదితర జూనియర్‌ కళాశాలల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఫగత యేడాది ఇంటర్‌ ఫలితాలు ఇలా..

జిల్లాలో గత విద్యా సంవత్సరం ఇంటర్‌ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో ద్వితీయ సంవత్సరంలో 64.29 శాతం, ప్రథమ సంవత్సరంలో 51.69 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ద్వితీయ సంవత్సరంలో బాలికలు 3,376 మంది పరీక్షలకు హాజరుకాగా 2,481 మంది 73.49 శాతం ఉత్తీర్ణత కాగా, బాలురు 2,365 మంది హాజరుకాగా 1,210 మంది 51.16 శాతం ఉత్తీర్ణులయ్యారు. అదేవిదంగా ప్రథమ సంవత్సరంలో బాలికలు 3,284 మంది పరీక్షలకు హాజరుకాగా 2,079 మంది 63.31 శాతం ఉత్తీర్ణత కాగా, బాలురు 2,433 మంది హాజరుకాగా 876 మంది 36 శాతం ఉత్తీర్ణులయ్యారు.

ప్రవేశాలు పెంచేందుకు కృషి

-తిరుపతి, అధ్యాపకుడు, ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, జగిత్యాల

వచ్చే విద్యా సంవత్సరంలో జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు బోర్డు అధికారుల ఆదేశాల మేరకు మండలాల్లోని ఉన్నత పాఠశాలల్లో ప్రచారం చేస్తున్నాం. అనేక పాఠశాలల్లోని విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. వెయ్యికి పైగా విద్యార్థుల వివరాలు సేకరించాం. గతేడాది కంటే ఈసారి ప్రవేశాలు పెంచేందుకు కృషి చేస్తాం.

ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులు

-నారాయణ, జిల్లా ఇంటర్‌ విద్య నోడల్‌ అధికారి

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులు ప్రవేశాలు పొందాలి. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అన్ని సౌకర్యాలతో కూడిన విద్యా బోధన కల్పిస్తున్నాం. ఇంటర్‌ బోర్డు ఆదేశాల మేరకు జూన్‌ 1 నుంచి తరగతులను ప్రారంభిస్తాం. అదే నెలలో ప్రవేశాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - Mar 10 , 2025 | 12:58 AM