కార్మికులకు ఇచ్చిన హామీలను అమలుచేయాలి
ABN, Publish Date - Feb 09 , 2025 | 12:55 AM
అధికారం లోకి వస్తే బీడీ కార్మికులకు రూ.4వేల చొప్పున అందిస్తామని ప్రకటించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేయాలని సీపీఎం జిల్లా కార్యద ర్శి బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు మూషం రమేష్ డిమాండ్ చేశారు.
సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : అధికారం లోకి వస్తే బీడీ కార్మికులకు రూ.4వేల చొప్పున అందిస్తామని ప్రకటించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేయాలని సీపీఎం జిల్లా కార్యద ర్శి బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు మూషం రమేష్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని అమృత్‌లాల్ శుక్లా కార్మిక భవనంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీడీ కార్మికులకు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి బీడీ కార్మికురాలికి రూ.4వేల పింఛన్ అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత అమలుచేయకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది బీడీ కార్మికులు పని చేస్తున్నారని, రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే 90వేల మంది కార్మికు లు బీడీ పరిశ్రమలపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నా రని అన్నారు. గత కొంత కాలంగా బీడీ పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులకు పనులు తగ్గించి ఇస్తున్నారని, నెలలో పదిరోజులకు మాత్ర మే పనులను కల్పిస్తున్నారని అన్నారు. బీడీ కార్మికుల కష్టాలను విప రీతంగా యాజమాన్యాలు దోచుకుంటున్నాయని, నెలకు కార్మికుల నుంచి 2వేల నుంచి 3వేల వరకు బీడీలను కట్ చేస్తూ కూలి తగ్గిస్తూ ఇస్తున్నారని అన్నారు. నాణ్యమైన తునికి ఆకులను ఇవ్వకపోవడంతో కార్మికులే ఆకులను కొనుగోలు చేసుకుని బీడీలను తయారుచేసి ఇస్తు న్నారన్నారు. ఈ రకంగా పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులను దోపిడీకి గురిచేస్తున్నాయని అన్నారు. బీడీ పరిశ్రమల యాజమాన్యా లపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, కార్మికుల బేసిక్ వేతనం పెంచకపోవడం, ప్రభుత్వం అండతో బీడీ పరిశ్రమల యాజమాన్యాల ఆగడాలకు అడ్డులేకుండా పోతోందన్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.4వేల పింఛన్‌ను కార్మి కులకు అందించి ఆదుకోవాలన్నారు. బీడీ కార్మికులను దోచుకుంటున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షం లో సీఐటీయూ బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామన్నారు. సమావేశంలో నాయకులు సూరం పద్మ, జిందం కమలాకర్, దాసరి రూ, జెజిగం సురేష్ పాల్గొన్నారు.
Updated Date - Feb 09 , 2025 | 12:56 AM