డ్రైవింగ్ లైసెన్స్ మేళాకు విశేష స్పందన
ABN, Publish Date - Jan 03 , 2025 | 12:44 AM
డ్రైవింగ్ లైసెన్స్ మేళాకు విశేష స్పందన లభించిందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్‌లో గల ఆర్టీవో కార్యాలయంలో పోలీస్‌శాఖ, రోడ్డు రవాణా శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్ మేళాలో పరీక్షలు నిర్వహించి 30 మందికి లర్నింగ్ లైసెన్స్‌లు ఎస్పీ అఖిల్ మహాజన్, డీటీవో లక్ష్మణ్ గురువారం అందజేశారు.
- ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్ల క్రైం, జనవరి 2(ఆంధ్రజ్యోతి): డ్రైవింగ్ లైసెన్స్ మేళాకు విశేష స్పందన లభించిందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్‌లో గల ఆర్టీవో కార్యాలయంలో పోలీస్‌శాఖ, రోడ్డు రవాణా శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్ మేళాలో పరీక్షలు నిర్వహించి 30 మందికి లర్నింగ్ లైసెన్స్‌లు ఎస్పీ అఖిల్ మహాజన్, డీటీవో లక్ష్మణ్ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిర్ణీత రుసుముతో ఏర్పాటుచేసిన ఆన్‌లైన్ లైసెన్స్ మేళాకు భారీగా స్పందించారన్నారు. మొదటి దశలో 100మందికి లైసెన్స్‌లు జారీ చేశామన్నారు.
రెండో దశలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 700 దరఖాస్తులు వచ్చాయన్నారు. దశల వారీగా ఆన్‌లైన్ పరీక్ష అనంతరం ఉత్తీర్ణత సాధించిన ప్రతీఒక్కరికి లర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారన్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపే వారికి రోడ్డు భద్రతపై అవగాహన లేకపోవడంతో ప్రమాదాలబారిన పడుతున్నా రన్నారు. లైసెన్స్ లేకుండా నడిపితే ప్రమాద బీమా వర్తించదన్నారు. దరఖాస్తుదారులందరికీ ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్‌చేసి లర్నింగ్ టెస్ట్ పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణత సాధించిన వారికి విడుతలవారీగా డ్రైవింగ్ లైసెన్స్‌లు అందజేస్తామన్నారు. మధ్యం సేవించి మూడు సార్లు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు పట్టుబడితే వారి లైసెన్స్ రద్దు కోసం రవాణాశాఖ అధికారులకు సిఫారసు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, టౌన్ సీఐ కె కృష్ణ, శ్రీనివాస్, ఎంవీఐలు వంశిధర్, రజనీదేవి పాల్గొన్నారు.
Updated Date - Jan 03 , 2025 | 12:44 AM