ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా అన్నకూటోత్సవం

ABN, Publish Date - Feb 09 , 2025 | 12:49 AM

జిల్లా కేంద్రంలోని మార్కెట్‌రోడ్‌ వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో శనివారం ఉదయం సుప్రభాత, అన్నకూటోత్సవ సేవలు ఘనంగా జరిగాయి. అనంతరం యాగశాలలో సుదర్శన హోమం జరిగింది.

కరీంనగర్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని మార్కెట్‌రోడ్‌ వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో శనివారం ఉదయం సుప్రభాత, అన్నకూటోత్సవ సేవలు ఘనంగా జరిగాయి. అనంతరం యాగశాలలో సుదర్శన హోమం జరిగింది. హోమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ సతీమణి మంజులతోపాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఉదయం శ్రీవారు సింహవాహనంపై, సాయంత్రం హనుమత్‌ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగారు. రాత్రి ఉత్సవ మూర్తుల ముందు సహస్ర దీపాలంకరణ సేవ నేత్రపర్వంగా కొనసాగింది. కార్యక్రమాల్లో ఆలయ వ్యవస్థాపక వంశపారంపర్య ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్‌, చకిలం గంగాధర్‌, ఈవో కందుల సుధాకర్‌ పాల్గొన్నారు.

నేటి కార్యక్రమాలు

ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మహాపూర్ణాహుతి, వసంతోత్సవం, చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి శ్రీపుష్పయాగం, ద్వాదశారాధన, సప్తావరణాలు, ధ్వజావరోహణ, ఏకాంతసేవ, పండిత సన్మాన, మహదాశీర్వచనం ఉంటుంది.

Updated Date - Feb 09 , 2025 | 12:49 AM