ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ లక్ష్యాలను కట్టుదిట్టంగా అమలుచేయాలి

ABN, Publish Date - Feb 19 , 2025 | 01:00 AM

ప్రభుత్వ లక్ష్యా లను అధికారులు కట్టుదిట్టంగా అమలుచేయాలని ప్ర భుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి అన్నారు.

సిరిసిల్ల, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ లక్ష్యా లను అధికారులు కట్టుదిట్టంగా అమలుచేయాలని ప్ర భుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి అన్నారు. మంగ ళవారం ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాజ న్న సిరిసిల్ల జిల్లా నుంచి కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా తోపాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. తాగునీటి సర ఫరా, రబీ పంటలకు సాగునీరు, డిమాండ్‌కు అనుగు ణంగా విద్యుత్‌సరఫరా, రేషన్‌కార్డుల దరఖాస్తుల ధ్రువీ కరణ, రైతు భరోసా పథకాల అమలుపై ముఖ్య కార్యద ర్శి సుదీర్ఘంగా చర్చించి పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా శాంతి కుమారి విద్యుత్‌పై సమీక్షిస్తూ, గత సంవత్సరం మార్చి నెలలో వచ్చిన అత్యధిక విద్యు త్‌ డిమాండ్‌ 15,623 మెగావాట్లు ప్రస్తుతం ఫిబ్రవరి మాసంలోనే వస్తుందని అన్నారు. 17 వేల మెగా వాట్ల పీక్‌ డిమాండ్‌ వచ్చిన సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు జరిగాయని తెలిపారు. వ్యవసాయం, గృహాలు, పరిశ్రమ లకు నిరంతరాయ విద్యుత్‌ సరఫరా కొనసాగాలని, అవ సరమైన మేర విద్యుత్‌ అందుబాటులో ఉన్నందున ఎక్కడ ఎటువంటి లోటు రావడానికి వీలు లేదని పేర్కొ న్నారు. సబ్‌ స్టేషన్ల వారీగా అదనపు విద్యుత్‌ పంపిణీ తట్టుకునేలా నూతన విద్యుత్‌లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పా టు పనులను ఫిబ్రవరి నెల వరకు పూర్తవుతున్నాయని పేర్కొన్నారు. విద్యుత్‌ సరఫరా అంశంలో స్థానికంగా ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే పరిష్కరించాలని, డిమాండ్‌ మేరకు విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు ఉం టే వెంటనే తమ దృష్టికి తీసుకుని రావాలని సూచించా రు. ఫీడర్ల వద్ద సమస్యతో గత సంవత్సరం కొన్ని ఇబ్బం దులు ఎదురయ్యాయని, ఈ సంవత్సరం ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలన్నారు. మిషన్‌ భగీరథ, పట్టణా ల్లో అమృత్‌ కింద చేపట్టిన తాగునీటి స్కీం, ఇతర తాగు నీటి స్కీంలు, ఆసుపత్రులు, వ్యవసాయ ఫీడర్లకు నిరం తరాయ సరఫరా ఉండే విధంగా ప్రత్యేకంగా పరిరక్షిం చాలన్నారు. కలెక్టర్లు తమ పరిధిలోని సబ్‌ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేస్తూ, అక్కడ పరిస్థితులను పరిశీలిస్తూ ఉండాలని అన్నారు.

గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాలి..

రైతు భరోసాపై జిల్లాలో గ్రీవెన్స్‌సెల్‌ ఏర్పాటు చేయా లని, మండల వ్యవసాయ అధికారి వ్యవసాయ విస్తరణ అధికారుల పరిధిలో గ్రీవెన్స్‌ ఏర్పాటు చేయాలని రైతుల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిశీలించి పరిష్కారా నికి చర్యలు తీసుకోవాలని శాంతికుమారి ఆదేశించారు. వ్యవసాయ యోగ్యమైన భూమికి రైతు భరోసా పథకం అమలుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు రైతులకు ఎకరానికి 12వేల రూపాయలు చొప్పున పెట్టుబడి సహాయంఅందిందని, 63శాతం పట్టా దారులు సహాయం పొందారన్నారు. ప్రజాపాలన గ్రామ సభలలో కొన్ని సర్వే నంబర్లలో కొంతమేర సాగుభూమి వ్యవసాయేతర భూమిగా నమోదైందని తమ దృష్టికి తీసుకుని వచ్చారని, వాటిని సరిచేసే అవకాశం రైతు భరోసా పోర్టల్‌లో అందించామన్నారు. రైతు భరోసా పో ర్టర్‌లో మిగిలిన వ్యవసాయ భూముల నమోదు ప్రక్రి యను కలెక్టర్లు పూర్తిచేయాలన్నారు. యాసంగి పంటకు అవసరమైన ఎరువులు సంపూర్ణంగా అందుబాటులో ఉన్నాయని, కలెక్టర్‌ స్టాక్‌ పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా అవసరం ఉంటే వెంటనే సంప్రదించాలని, ఎక్కడైనా సింగిల్‌ విండోల వద్ద స్టాక్‌ లేకపోతే వెంటనే స్టాక్‌ అందించేలా చూడాలని అన్నారు.

చివరి ఆయకట్టు వరకు సాగునీరు..

యాసంగి సాగు నీటి సరఫరాపై ఆన్‌, ఆఫ్‌ విధానంలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ అన్నారు. నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం సాగు నీరు రైతులకు అందాలని, ప్రతి నీటి చుక్కను వినియోగించుకోవాలని అన్నారు. వేసవి కాలంలో తాగునీటి సరఫరాపై సమీ క్షిస్తూ, మిషన్‌ భగీరథ ద్వారా 25వేల హాబి టేషన్స్‌కు తాగునీటి సరఫరా చేస్తున్నామని అన్నారు. మిషన్‌భగీరథ ఇబ్బందులు ఉన్న గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయా లని అన్నారు. గతంలో ఉన్న నీటి సరఫరా స్కీములు, పంప్‌ సెట్‌ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు చేపట్టాల ని, అవసరమైతే పైవ్రేట్‌ బోర్లను అద్దెకు తీసుకొవాలని అన్నారు. జిల్లాలో నీటి సమస్యలు ఉన్న ప్రాంతాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అన్నారు.

రేషన్‌ కార్డుల దరఖాస్తులు పరిశీలించాలి

ప్రజా పాలన అర్జీలు, గ్రామసభల్లో వచ్చిన దరఖా స్తులు, మీసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులు అన్నింటిని పరిశీలించి రేషన్‌కార్డులు జారీ ప్రక్రియ వేగ వంతం చేయాలన్నారు. రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలు పదేపదే మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, ఆ దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ లేని జిల్లాల్లో నూతన రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ పూర్తిచేయాలని, తర్వాత మిగిలిన జిల్లాల్లో పూర్తి చే యాలన్నారు. జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్‌ పాఠశాలలో సంక్షేమ హాస్టల్స్‌ కస్తూర్బా గాంధీ విద్యాలయాలను నిరంతరం తనిఖీ చేయాలన్నారు. సమావేశంలో ఇన్‌చా ర్జి డీపీవో శేషాద్రి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జ ల్‌బేగం, మిషన్‌ భగీరథ అఽధికారులు అమరేందర్‌, జా నకి ఇరిగేషన్‌ అధికారి అమరేందర్‌రెడ్డి సివిల్‌ సప్లయ్‌ అధికారులు వసంతలక్ష్మీ,రజిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 19 , 2025 | 01:00 AM