ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి
ABN, Publish Date - Feb 04 , 2025 | 12:53 AM
పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యా శాఖ మంత్రిని నియమించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ల నాగరాజు డిమాండ్ చేశారు.
గణేశ్‌నగర్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యా శాఖ మంత్రిని నియమించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ల నాగరాజు డిమాండ్ చేశారు. సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా 18వ మహాసభల ప్రారంభం సందర్భంగా తెలం గాణ చౌక్ నుంచి కళాభారతి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు అరవింద్ అధ్యక్షతన నిర్వ హించిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రంలో రూ.8200 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్కాలర్ షిప్ విడుదల చేయడంలో విఫల మైందని, దీంతో విద్యార్థులు చదువులకు దూరమ్యే పరిస్థితి నెలకొంటోందని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలను అవలం బిస్తోందన్నారు. యూనివర్సిటీల్లో నూతనంగా తీసుకొ స్తున్న మార్గదర్శకాలను రద్దు చేయాలన్నారు. కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించక పోవడం సిగ్గు చేటన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రజినీకాంత్, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపెల్లి పూజ, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు పాల్గొన్నారు.
Updated Date - Feb 04 , 2025 | 12:53 AM