ముంపు గ్రామాల ప్రజల ఉపాధికి పరిశ్రమల ఏర్పాటు..
ABN, Publish Date - Jan 24 , 2025 | 01:01 AM
మధ్య మానేరు ముంపు నిర్వాసితు లకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ప్రభత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ టౌన్, జనవరి 23 (ఆంధ్ర జ్యోతి): మధ్య మానేరు ముంపు నిర్వాసితు లకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ప్రభత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ మండ లం రుద్రవరంలో నిర్వహించిన గ్రామసభ కు గురువారం హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ అర్హు లైన అందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ప్రజాపాలన గ్రామసభ ల్లో చదివిన జాబితాల్లో పేర్లు లేని అర్హులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన పని లేదని హా మీఇచ్చారు. గతంలో మాదిరిగా నాలుగు గోడల మధ్యం లబ్ధిదారుల ఎంపిక చేయడం లేదని, ప్రజల సమక్షంలో ఎంపిక జరుగుతుందన్నారు. ముంపు గ్రామాల ప్రజల కు ఉపాధి కల్పించేందుకు మంత్రి శ్రీధర్‌బాబుతో ఇప్ప టికే చర్చించామని వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహేష్‌కుమార్ కాంగ్రెస్ మండల అధ్య క్షుడు పిల్లి కనుకయ్య, సింగిల్వీండో చైర్మన్ రేగులపాటి కృష్ణదేవరావు, కత్తి కనుకయ్య, గాలిపెల్లి స్వామి, ఊరడి రాంరెడ్డి వంకాయల భూమయ్య తదితరులు ఉన్నారు.
Updated Date - Jan 24 , 2025 | 01:01 AM