పక్కా కార్యాచరణతో మాదక ద్రవ్యాల నియంత్రణ
ABN, Publish Date - Feb 16 , 2025 | 12:49 AM
జిల్లాలో మా దక ద్రవ్యాల నియంత్రణకు పక్కా కార్యాచరణ అమలు చేయా లని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మా దక ద్రవ్యాల నియంత్రణకు పక్కా కార్యాచరణ అమలు చేయా లని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. జిల్లాలో మాద క ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి సంబంధిత అధికారులతో జిల్లాస్థా యి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని కలెక్టర్ శనివారం నిర్వ హించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మా ట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వా రిపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ చర్యలు తీసుకోవాలని ఆదేశించిందన్నారు. డ్రగ్స్ నియంత్రణకు వివిధ శాఖల అధికా రులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. మాదక ద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సెలింగ్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలనీ వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. అటవీ శాఖ అధికారులు వారి పరిధి లోని అటవీ భూములు పరిశీలించి గంజాయి సాగు కనిపిస్తే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. జిల్లాలోని ఆసుపత్రులు, మెడికల్ షాపుల్లో స్టాక్ వివరాలను ప్రతినెల తనిఖీచేయాలని సూచిం చారు. ఎస్పీ అఖిల్ మహజన్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి ని యంత్రణకు ప్రత్యేక డైరవ్ చేపట్టామని తెలిపారు. గంజాయి అరికట్టేం దుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని, డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే నష్టాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. జిల్లాలో గం జాయి పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉన్నాయని, డ్రంకెన్ డైరవ్ తరహాలో గంజాయి కిట్లతో తనిఖీలు చేస్తు న్నామని, గంజాయి పాజిటివ్ వచ్చిన వారి నుంచి సరఫరా దారులను పట్టుకుంటున్నామన్నారు. సమావేశంలో వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రజిత, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ భవాని, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Feb 16 , 2025 | 12:49 AM