ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజా భద్రతలో రాజీ పడం

ABN, Publish Date - Feb 01 , 2025 | 12:56 AM

ప్రజా భద్రతలో రాజీ పడమని, రోడ్డు భద్రతలో నిర్లక్ష్యం గా వ్యవహరించే వారిపై కఠినమైన చర్యలు తీసు కుంటామని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా పెద్దపల్లి పట్టణంలో హెల్మెట్‌ ర్యాలీ, అవగాహన సదస్సు నిర్వహించారు.

జెండా ఊపి బైక్‌ ర్యాలీని ప్రారంభిస్తున్న జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీ సెక్రెటరీ స్వప్న రాణి

- రామగుండం సీపీ శ్రీనివాస్‌

పెద్దపల్లి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ప్రజా భద్రతలో రాజీ పడమని, రోడ్డు భద్రతలో నిర్లక్ష్యం గా వ్యవహరించే వారిపై కఠినమైన చర్యలు తీసు కుంటామని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా పెద్దపల్లి పట్టణంలో హెల్మెట్‌ ర్యాలీ, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పట్టణ పోలీస్‌ స్టేషన్‌ నుంచి నందన గార్డెన్‌ వరకు హెల్మెట్‌ అవగాహన ర్యాలీని జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీ సెక్రెటరీ, సబ్‌ జడ్జి స్వప్నరాణి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. నందన గార్డెన్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో సీపీ మాట్లాడుతూ హెల్మెట్‌ ర్యాలీ నిర్వహించే సమయంలో చాలా మంది వాహనదారులు, కుటుంబసభ్యులతో పరిమితికి మించి వెళ్తున్నారని అన్నారు. రోడ్డు భద్రతలో వాహనదారుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వారితోపాటు ఇతరులకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉందని అటువంటి వారిపై ఉదాసీనం గా వ్యవహరించవద్దని, కఠినవైఖరితో ఉండాలని పోలీసుల ను ఆదేశించారు. చట్టాన్ని గౌరవించి నియమాలు పాటించినవారికే సహకారం అందించాలని సూచించారు. హెల్మెట్‌ తప్పకుండా వాడాలని, ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు భద్రత పాటించకుండా, ర్యాష్‌ డైవ్రింగ్‌, ట్రిబుల్‌ డైవ్రింగ్‌, రాంగ్‌ రూట్‌లో వాహనాలు నడిపితే వాహనాలు సిజ్‌ చేస్తామని హెచ్చరించారు. ఎటువంటి ప్రమాదాలు లేకుండా వాహనాలు నడిపిన డ్రైవర్లను ఘనంగా సన్మానించారు. కేశోరం సిమెంట్‌ ఫ్యాక్టరీ వారి సహాయం తో మున్సిపల్‌ కార్మికులకు, పాత్రికేయులకు హెల్మెట్‌ లను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో డీసీపీ పెద్దపల్లి చేతన, జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీ సెక్రెటరీ సబ్‌ జడ్జి స్వప్నరాణి, అడిషనల్‌ డీసీపీ (అడ్మిన్‌) రాజు, పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, రామగుండం ట్రాఫిక్‌ ఏసీపీ జానీ నర్సింహులు, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌కుమార్‌, సీఐ ప్రవీణ్‌ కుమార్‌, జిల్లా రవాణా అధికారి రంగారావు తదితరులు పాల్గొన్నారు.

- ఆర్టీసీ డ్రైవర్‌ తిరుపతికి సన్మానం

కళ్యాణ్‌నగర్‌: గోదావరిఖని ఆర్‌టీసీ డిపోలో పని చేస్తున్న డ్రైవర్‌ తిరుపతిని జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో రామగుండం సీపీ శ్రీనివాస్‌ ఘనంగా సన్మానించారు. తిరుపతి గోదావ రిఖని ఆర్టీసీ డిపోలో 30 సంవత్సరాలుగా పనిచేస్తూ ఎలాంటి ప్రమాదాలు లేకుండా బస్సు నడిపినందు కు సీపీ అభినందించారు. కార్యక్రమంలో ఖని డిపో మేనేజర్‌ నాగభూషణం, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ సంధ్యా రాణి, ట్రాఫిక్‌ ఇన్‌చార్జి లింగయ్య, అమృత, ఎంప్లా యీస్‌ వెల్ఫేర్‌ బోర్డు ఇన్‌చార్జి రాజిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2025 | 12:56 AM