కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రంపై వివక్ష
ABN, Publish Date - Feb 04 , 2025 | 12:50 AM
కేంద్ర బడ్జెట్‌లో ఎన్టీయే ప్రభుత్వం రాష్ట్రంపై వివక్ష చూపిందని సుడా చైర్మన్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు. బడ్జెట్లో తెలంగాణపై వివక్ష చూపి అన్యాయం చేయడంపై జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కరీంనగర్ కోర్టు చౌరస్తా అంబేద్కర్ విగ్రహం ఎదుట సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.
- సుడా చైర్మన్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి
- కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన
కరీంనగర్ అర్బన్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్‌లో ఎన్టీయే ప్రభుత్వం రాష్ట్రంపై వివక్ష చూపిందని సుడా చైర్మన్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు. బడ్జెట్లో తెలంగాణపై వివక్ష చూపి అన్యాయం చేయడంపై జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కరీంనగర్ కోర్టు చౌరస్తా అంబేద్కర్ విగ్రహం ఎదుట సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, వారిలో ఇద్దరు కేంద్ర మంత్రులున్నా ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. కేంద్రం రాష్ట్రానికి చిల్లి గవ్వా ఇవ్వలేదన్నారు. ఈ విషయంపై బీజేపీ ఎంపీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉండి నియోజకవర్గ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు. కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పీసీసీ ఎస్సీ సెల్ సీనియర్ కన్వీనర్ వెన్న రాజమల్లయ్య, నాయకులు ఎండీ తాజుద్దీన్, శ్రావణ్ నాయక్, కొరివి అరుణ్‌కుమార్, పులి ఆంజనేయులుగౌడ్, కామిడి రాంరెడ్డి, పంజాల స్వామి గౌడ్, ఆకారపు భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Feb 04 , 2025 | 12:50 AM