ఆర్టీసీ డిపో ఎదుట అద్దె బస్ డ్రైవర్ల ధర్నా
ABN, Publish Date - Mar 02 , 2025 | 12:56 AM
ఆర్టీసీ కాంట్రాక్ట్ డ్రైవర్ల ఉద్యోగాల భర్తిలో తమ కు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం సిరిసిల్ల టీజీఆర్‌టీసీ డిపో ఎదుట హైర్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు.
సిరిసిల్ల టౌన్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి) : ఆర్టీసీ కాంట్రాక్ట్ డ్రైవర్ల ఉద్యోగాల భర్తిలో తమ కు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం సిరిసిల్ల టీజీఆర్‌టీసీ డిపో ఎదుట హైర్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా టీజీఆర్టీసీ హైర్ బస్సు డైవర్స్ అసోసియేషన్ సిరిసిల్ల డిపో అధ్యక్షుడు గొల్లప ల్లి రాజు మాట్లాడారు. సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో హైర్ బస్సు డ్రైవర్లుగా దాదాపు 10 సంవత్సరా లుగా పని చేస్తున్నామన్నారు. ఆర్డీసీలో కాంట్రా క్ట్ బేసిక్‌లో డ్రైవర్ల నియామకాలకు దరఖాస్తు చేసుకోవడానికి హైర్ బస్సు డ్రైవర్లు శుక్రవారం కరీంనగర్‌లోని ఆర్‌ఎం కార్యాలయానికి వెళ్లామ ని, సిరిసిల్ల డిపో హైర్ బస్సు డ్రైవర్లకు ఉద్యోగా లు ఇచ్చే అవకాశం లేదని, కొత్తవారికే మాత్ర మే అవకాశం ఉందని అధికారులు దరఖాస్తు లు స్వీకరించడానికి నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. హైర్ బస్సులు నడిపే డ్రైవర్లకు ఎందుకు ఆర్టీసీ డ్రైవర్లుగా అవకాశం ఇవ్వరని ప్రశ్నించారు. ఏ కారణంతో హైర్ బస్సు డ్రైవర్ల ను తీసుకోవడం లేదో లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనుభవం అర్హత ఉన్న హైర్ బస్సు డ్రైవర్లకు అవకాశం ఇవ్వకుం డా అనుభవం లేని డ్రైవర్లను తీసుకోవడంపై పలు అనుమానాలను తావిస్తోందన్నారు. ఇప్ప టికైనా ఉన్నతాధికారులు దీనిపై స్పందించి అనుభవం అర్హత ఉన్న హైర్ బస్సు డ్రైవర్లకు ఆర్టీసీ కాంట్రాక్ట్ డ్రైవర్ల ఎంపికలో మొదటి ప్రాధాన్యతను ఇస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సిరిసిల్ల డిపో ఉపాధ్యక్షుడు గొర్రె రమేష్, ప్రధానకార్య దర్శి భూక్య శ్రీను, కోశాధికారి పిట్ల నరేష్, నాయకులు లింగరావు, నరేందర్, శ్రీకాంత్, రత్నాకర్, వెంకటస్వామి, భాస్కర్, బాలకృష్ణ, జగన్ హైర్ బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు.
Updated Date - Mar 02 , 2025 | 12:56 AM