ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యతోనే అభివృద్ధి సాఽధ్యం

ABN, Publish Date - Jan 04 , 2025 | 12:26 AM

విద్యతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమని నమ్మి, దేశంలో బాలికలకు పాఠశాలలు ఏర్పాటు చేసిన మహనీయురాలు సావిత్రిబాయిపూలే అని కలెక్టర్‌ పమేలా సత్పతి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో సావిత్రిబాయిపూలే జయంతిని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కేక్‌ కట్‌ చేస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌ టౌన్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): విద్యతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమని నమ్మి, దేశంలో బాలికలకు పాఠశాలలు ఏర్పాటు చేసిన మహనీయురాలు సావిత్రిబాయిపూలే అని కలెక్టర్‌ పమేలా సత్పతి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో సావిత్రిబాయిపూలే జయంతిని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సావిత్రిబాయిపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సావిత్రిబాయిపూలే స్ర్తీలను చైతన్యపరిచి కులవ్యవస్థ, బాల్య వివాహాలు, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. పోరాటం, త్యాగాలతోనే ప్రస్తుతం మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రపుల్‌ దేశాయ్‌, లక్ష్మీకిరణ్‌, ఇంచార్జి డీఆర్‌వో పవన్‌ కుమార్‌, ఆర్డీవో మహేశ్వర్‌, డీఈవో జనార్ధన్‌రావు, కలెక్టరేట్‌ ఏవో సుధాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 12:26 AM